
“మీ సంతోషాన్ని ఇతరులు ప్రభావితం చేస్తూ ఉంటే మీలో మానసిక పరిపక్వత ఇంకా జరగాల్సి ఉందని అర్ధం”
-Telugu Samhitha

“మీ జీవితంలో మీరు ఇదివరకు సాధించిన దానికంటే మెరుగ్గా ప్రయత్నించడమే పరిణితి చెందడం”
-Telugu Samhitha

“మీ కోపం ఇతరులపై పెత్తనాన్ని, తోటి వారిపై భయాన్ని, మీపై అనారోగ్యాన్ని ఉంచుతుంది”
-Telugu Samhitha

“మీరు అన్నీ తెల్సినట్టు ఎప్పుడైతే ఆగిపోతారో అప్పుడే మిగిలిన వారికంటే వెనుకబడిపోతారు”
-Telugu Samhitha

“విషయాలపై మీ సూక్ష్మమైన అవగాహన ఆ విషయాలపై ఇతరుల అభిప్రాయం కంటే మెరుగైనది”
-Telugu Samhitha

“ఇతరుల సంతోషంలో మీ సంతోషాన్ని కనుగొనగలిగితే, మీకంటే సంతోషం ప్రపంచంలో ఉండదు.”
-Telugu Samhitha

“భూమిపై ఏ ప్రాణికీ తన మరణం గురించిన స్పృహ ఉండదు, మనిషికి స్పృహ ఉన్నప్పటికీ లేనట్టుగానే జీవిస్తాడు”
-Telugu Samhitha

“మీరు మీ steroids for sale body-muscles.com steroids-usa.net భవిషత్తు కోసం అతిగా ఆరాటపడితే భవిష్యత్తులో మీరు కోల్పోయిన గతాన్ని మాత్రమే ప్రేమించగలుతారు”
-Telugu Samhitha

“మీ ఆలోచనలు గతం కంటే భవిష్యత్తు వైపుకి ఎక్కువగా చూస్తుంటే మీరు ఆశావాది. భవిష్యత్తు కంటే గతాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటే మీరు నిరాశావాది. గతాన్ని మరిచి భవిష్యత్తుని మాత్రమే చూస్తూ ఉంటే మీరు దురాశావాది. భవిష్యత్తుని మరిచి గతాన్ని మాత్రమే చూస్తూ ఉంటే మీరొక విఫలవాది”
-Telugu Samhitha

“మీ మాట ఎంత విలువైనది అయినప్పటికీ మీ స్థాయి మాత్రమే దానికి ఒక ఉనికిని ఏర్పాటు చేయగలదు”
-Telugu Samhitha

“మీ ఆలోచనా శక్తిని ఆలోచనల రాపిడి చేత నిరంతరం పదును పెట్టండి. దాని పనితీరుని కేవలం గమనిస్తూ ఉండండి. దానిని ఆచరణలో పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు పరీక్షించండి. ఎందుకంటే అది ఒక శక్తివంతమైన క్షిపణి.”
-Telugu Samhitha

“ప్రపంచంలోని మొత్తం వైఫల్యాలను మీ భుజం మీద వేసుకున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపిస్తే దిగులు పడకండి. ఎందుకంటే వాటిని మోయడంలో మీరు విజయం సాధించారు”
-Telugu Samhitha

“రేపు రాబోయే కష్టాన్ని తలచుకుని ఈరోజు చింతిస్తూ దిగులు పడకండి. మీరు ఆనందంగా గడపడానికి ఈ రోజంతా మీకు అవకాశం ఉంది”
-Telugu Samhitha

“ప్రకృతిలో మమేకమై జీవించడం అంటే ప్రకృతితో కలిసి జీవించడం కాదు, మీరు కూడా ప్రకృతిలో భాగంగా అనుభూతి చెందడం”
-Telugu Samhitha

“ఏది మీకు ప్రేరణ కలిగిస్తుందో, ఏది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందో, ఏది మీ చంచల మనసుని నియంత్రిస్తోందో దాని ఆసరాతో మీ లక్ష్యాన్ని చేరుకోండి”
-Telugu Samhitha

“ధర్మంలో తార్కికత అంతర్లీనంగా ఉంటుంది. ధర్మ బద్దుడైన మనిషి ప్రతి ప్రశ్నకు హేతుబద్దమైన సమాధానం ఇవ్వగలడు”
-Telugu Samhitha

“మీ శరీర రుగ్మతలకు మీకంటే గొప్ప వైద్యుడు ఈ ప్రపంచంలో ఉండడు. దాని బాధను, అవసరాలను మీరు మాత్రమే ప్రత్యక్షంగా గ్రహించగలరు”
-Telugu Samhitha

“మీరు నిరుపేదగా మారినప్పుడు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారిని కనుగొనే అవకాశం లభిస్తుంది”
-Telugu Samhitha

“మీలో సంకల్ప శక్తి క్షీనించడమే నిజమైన వృధ్యాప్యం, అది మాత్రమే మిమ్మల్ని అచేతనంగా మార్చగలదు”
-Telugu Samhitha

“విషయాల పట్ల ఆశక్తి, ప్రాధాన్యత లేకపోవడాన్ని ‘మతిమరుపు’ అనే పేరుతో ప్రజలు తప్పించుకుంటూ ఉంటారు”
-Telugu Samhitha

“మీ మాట ఎంతో విలువైనదిగా ఉండాలంటే, మీ ప్రతీ మాట యొక్క ప్రయోజనాన్ని ఆలోచిస్తూ మాట్లాడండి”
-Telugu Samhitha

“మీ జీవితాన్ని మీరు ఎంత అందంగా కోరుకుంటున్నారో దానిని అంతే అందంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి”
-Telugu Samhitha

“మీరు బిజీగా ఉంటే సమయాన్ని కోల్పోతారు, మీరు బిజీగా లేకుంటే సమర్ధతని కోల్పోతారు”
-Telugu Samhitha

“సోమరులు తమ అసమర్ధతని సమర్ధించుకోవడానికి సహయం చేసిన వారిని కూడా దూషిస్తూ ఉంటారు”
-Telugu Samhitha

“సహనం భరించడానికి కష్టమైనది, ఎదుగుదలకు సులభమైనది”
-Telugu Samhitha

“ఇతరులు మీపట్ల ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఇతరుల పట్ల మీరు కుడా అలానే ప్రవర్తించండి.”
-Telugu Samhitha

“డబ్బుతో యాదృచ్ఛిక ప్రమాదాలను నియంత్రించలేము. కానీ వాటిని ఎదుర్కోగలము.”
-Telugu Samhitha

“మీ వద్ద స్థోమత కలిగి, మీకు ఎదురైన డబ్బు సమస్య ఏదైనా అసలు సమస్యే కాదు. దానికోసం చింతిస్తూ కూర్చోవడమే పెద్ద సమస్య”
-Telugu Samhitha

“మీరు మీ కుటుంబీకులతో సంబంధ బాంధవ్యాలను సరిగా నిర్వహించలేనప్పుడు మీ అంతిమ యాత్రను తలచుకొంటూ ఉండండి. సంబంధ బాంధవ్యాలు వాటికవే సద్దుమనుగుతాయి”
-Telugu Samhitha

“జ్ఞాని అంటే సర్వ గ్రంధాలను అవపోషణ పట్టినవాడు కాదు, వాటిని సందర్భోచితంగా సమయస్పూర్తితో ఉపయోగించడం తెలిసినవాడు”
-Telugu Samhitha

“మీకు సాధ్యమయ్యే మార్గంలోనే ఇతరులు కుడా పయనించాలని కోరుకోవడం మూర్కత్వం. సమర్ధత ఉన్నప్పటికీ మార్గాల ఎంపికలో వ్యక్తి వ్యక్తికీ వ్యత్యాసం ఉంటుంది.”
-Telugu Samhitha

“మీ కారణంగా ఏ ఒక్క వ్యక్తి సంతోషంగా లేకపోయినా ఫలితంగా ఏనాటికైనా అది మీ సంతోషాన్ని ప్రభావితం చేస్తుంది”
-Telugu Samhitha

“తనకి ఏది కావాలో తెలిసినవాడు వివేకవంతుడు, ఏది వద్దో కూడా తెలిసిన వాడు జ్ఞాన వంతుడు”
-Telugu Samhitha

“మీరు దేని ద్వారా అయితే అత్యంత సంతోషంగా ఉండగలుగుతున్నారో అదే మీ బలహీనత”
-Telugu Samhitha

“మీకు జీవితంలో నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు మొదటిగా చేయవలసింది మీ అంతరాత్మలో రగులుతున్న సంఘర్షణని దారి మళ్ళించడం”
-Telugu Samhitha

“మీరు నిరంతరం ఇతరులను అనుకరిస్తూ ఉంటే మీ ఉనికిని మీరే మర్చిపోయే ప్రమాదం ఉంది”
-Telugu Samhitha

“జింకకు తన భయమే పులి నుండి ప్రాణాలను కాపాడుకునే శక్తిని ఇస్తుంది. మీ ధైర్యం ఎక్కడ ప్రదర్శించాలో మీకు స్పృహ ఉండాలి”
-Telugu Samhitha

“మీరు కోరుకున్నది మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు, మీరు కోరుకోనిది కూడా మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ ప్రతికూల పరిస్థితిలో మీరు కోరుకున్నది అదనంగా మీకు బాధని కలిగిస్తుంది”
-Telugu Samhitha

“మీరు రాజీ పడటం ద్వారా ఒక అభౌతికమైన వివాదం పరిష్కరించబడితే మీకు కలిగిన నష్టం కంటే లాభమే ఎక్కువ”
-Telugu Samhitha

“మిమ్మల్ని మీరు నియంత్రించుకునే స్థితిలో ఉన్నప్పుడు మీ ప్రశాంతతను ఎవరూ భంగపరచలేరు”
-Telugu Samhitha

“విషయాలపై అతిగా స్పందించడం అంటే ఆ విషయాల యొక్క ప్రలోభానికి గురి అవుతున్నామని అర్ధం”
-Telugu Samhitha

“ఎదుటివారిని నియంత్రించేందుకు మీరు కోపాన్ని ప్రదర్శిస్తే, మిమ్మల్ని నియంత్రించేందుకు ఎదుటివారు నటనని ప్రదర్శిస్తారు. ఫలితంగా మీరు వాస్తవికతకు దూరం అవుతారు”
-Telugu Samhitha

“విజయం మీలో రెండు రకాల భాననలను కలిగిస్తుంది. మొదటిది సమాజం దృష్టిలో విజయం, రెండవది మీ అంతరాత్మ దృష్టిలో విజయం. మొదటిది మిమ్మల్ని ప్రలోభపెడుతుంది. రెండవది మీ ఆత్మ విశ్వాసాన్ని పదిలం చేస్తుంది”
-Telugu Samhitha

“మీరు మీ భౌతిక శరీరంతో పాటు కాలంతో మారుతున్న మానసిక మార్పులను క్షుణ్ణంగా పరిశీలించగలిగితే మీలో సుక్ష్మ దృక్పదం మేల్కొంది అని అర్ధం”
-Telugu Samhitha

“మీకు ఎంతో ఇష్టమైన మీ గత స్మృతలను కళ్ళు మూసుకుని లెక్కించండి. మీ జీవితం యొక్క అసలైన వ్యవధి మీకు అవగతం అవుతుంది”
-Telugu Samhitha

“మిమ్మల్ని బాధించే అంశాలను మీరు సాధించాలనుకునే లక్ష్యానికి ప్రేరణగా మళ్ళించండి”
-Telugu Samhitha

“మీ దృష్టిలో ఒక గొప్ప విషయం ఇతరుల దృష్టిలో ఎంతో తేలికైనది కావచ్చు. కాబట్టి మీ దృక్పదాన్ని ఇతరులకు రుద్దాలని ప్రయత్నించకండి”
-Telugu Samhitha

“మీరు ఇతరుల అభిప్రాయంతో ఏకీభవించలేని స్థితిలో ఉన్నప్పుడు వారితో వాదనలు చేయకుండా ఉండటం ఇరువురికీ ఎంతో శ్రేయష్కరం”
-Telugu Samhitha

“లక్ష్యం అనే అస్త్రాన్ని అడ్డంకులు అనే వింటినారి ఎంత గట్టిగా వెనక్కి లాగితే అది అంత వేగంగా విజయం అనే గమ్యాన్ని చేరుతుంది”
-Telugu Samhitha

“క్షణాల్లో మారిపోయే మీ ఆలోచనలకు మితిమీరిన ప్రాధాన్యతను ఇవ్వకండి. లేని పక్షంలో అవి మీరు కూడా వదిలించుకోలేని జఠిల సమస్యలుగా రూపాంతరం చెందుతాయి”
-Telugu Samhitha