ప్రతిఫలం

A Short Moral Story in Telugu

దేవుడంటే ఎంతో భక్తి ఉన్న ఒక వ్యాపారి ఒకరోజు దేవుడి మీద ఎంతో కోపంగా ఉన్నాడు. అతడు చేయని పూజలు లేవు, పాటించని వ్రతాలు లేవు. దేశంలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, తీర్ధాలు ఇలా అతని దర్శించని ప్రదేశం, కొలవని చోటు కనిపించేది కాదు. అంత చేసినా దేవుడు అతనికి ఏనాడు దర్శనం ఇవ్వలేదు. కనీసం కలలో అయినా కనిపించమని వేడుకున్నాడు. అయినా ఎటువంటి ప్రతిఫలం లేకపోయింది. అప్పటితో అతడికి తన జీవితం మీద ఎంతో అసహనం కలిగింది. 

అసలు దేవుడు అనే వాడు ఉంటే తన గోడు వినిపించుకోకుండా ఉంటాడా అని అతడు దీర్ఘంగా ఆలోచించాడు. వెంటనే ఆవేశంతో ఇంటిలోకి వెళ్లి దేవుడి చిత్రపటాలను అన్నింటినీ తొలగించి ఒక మూటగా కట్టాడు. ఆ మూటను ఊరికి దూరంగా పారవేసేందుకు అతడు ఆవేశంగా బయల్దేరాడు. 

A Short Moral Story in Telugu 2021

అలా ఊరికి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి ఒక కొండ పైకి ఎక్కాడు. కొండ మీద నుండి క్రింద ప్రవహిస్తున్న వాగు వైపు చూసి అదే సరైన ప్రదేశం అని భావించాడు. వెంటనే తన భుజం మీద నుండి మూటను కిందకి దించి అందులోని దేవుడి చిత్రపటాలు మరియు విగ్రహాలను ఒక్కొక్కటిగా బయటకు తీసాడు. 

అటువైపుగా వెళ్తున్న ఒక సన్యాసి ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా ఉన్న అతడిని చూసి దగ్గరకు వచ్చాడు. మహోన్నత తపస్వికుడిగా అతని కళ్ళలో తేజస్సు వెలిగిపోతూ ఉంది. సన్యాసిని చూడగానే ఆ వ్యాపారి తన మూటను సర్దుకున్నాడు. అతడు దగ్గరకి రాగానే అప్రమేయంగా తన చేతులను జోడించి నమస్కరించాడు. వెంటనే తేరుకుని మూటను ఆ సన్యాసికి కనబడనీయకుండ దాచడానికి ప్రయత్నించాడు.

సన్యాసి ఆ వ్యక్తిని చూసి నువ్వు దాచినంత మాత్రాన అందులోని సత్యం దాగిపోతుందా అన్నాడు. వెంటనే వ్యాపారి ఆ మూటను కిందకు దించి దానిని తెరిచి సన్యాసికి చూపించాడు. తర్వాత సన్యాసి వైపు చూసి “నేను దేవుడి పట్ల ఎంతో భక్తీ భావంతో ఇప్పటివరకు నా జీవితాన్ని గడిపాను. నిజంగా ఆయనే ఉంటే నేను చిరకాలంగా కోరుతోన్న ఒకే ఒక్క కోరికను మన్నించకుండా ఉంటాడా? ఇన్నేళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కసారి అయినా దేవుడు ప్రత్యక్షం కాకుండా ఉంటాడా? నిజానికి దేవుడు అనే వాడు లేడు. అంతా మన భ్రమ మాత్రమే. నా సగం జీవితం దేవుడు ఉన్నాడనే అజ్ఞానంలోనే గడిచిపోయింది. ఇన్నాళ్ళకు నేను సత్యాన్ని తెలుసుకున్నాను.

అందుకే ఇంటిలోని దేవుడి ఆనవాళ్ళు అన్నింటినీ పోగుచేసి ఇక్కడ నిమజ్జనం చేయాలని నిర్ణయించాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు సర్వం త్యాగం చేసి దేవుని భ్రమలో మీ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారని నాకు తోస్తోంది. కాబట్టి మీరు కూడా సత్యాన్ని గ్రహించి మీ జీవితంలో సరైన మార్గాన్ని అనుసరిస్తారని నా విన్నపం” అంటూ ఆ వ్యాపారి సన్యాసికి సలహాలు ఇవ్వడం ప్రారంభించాడు. 

సన్యాసి ఆ వ్యాపరి మాటలకు ఆశ్చర్యపడుతూ “నాయనా, నీవు చెప్పిన మాటలు నా మనసులో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తూ ఉన్నాయి. ఒక నిశ్చయానికి వచ్చే ముందు సత్యాసత్యాలను ప్రతీ వ్యక్తి వారి స్వీయ విచక్షణకు లోబడి విచారణ చేయాలి. కాబట్టి నీవు ఈ సత్యాన్ని ఏ విధంగా తెలుసుకున్నావో నాకు అర్ధమయ్యే రీతిలో వివరించు. అప్పుడే నేను నీ అభిప్రాయాన్ని స్వీకరించడానికి మార్గం సులభతరం అవుతుంది అన్నాడు. 

వ్యాపారి తన గతం అంతా ఆ సన్యాసితో పంచుకోవడం ప్రారంభించాడు. నిజంగా దేవుడే ఉంటే, పాపపుణ్యముల ప్రభావం మనిషి మీద ఉంటే దేవునికే అంకితం చేయబడిన ఈ జీవితంలో నేను కోరుకున్న ఇంత సామాన్యమైన కోరికను కూడా దేవుడు నెరవేర్చలేడా? అని సన్యాసిని ప్రశ్నించాడు. 

వ్యాపారి మాటలకు సన్యాసి తిరిగి ఆలోచనలో పడ్డాడు. తర్వాత సన్యాసి మాట్లాడుతూ “దేవుని కోసం ఇన్నేళ్ళ నా అన్వేషణ మొత్తం వృధా అని నీవు చెప్తుంటే నా మనసు అంగీకరించడం లేదు. కనుక దానిని నిరూపణ చేసేందుకు నువ్వు ఈ ఒక్కరోజు దేవుడి మీద అచంచలమైన విశ్వాశాన్ని ఉంచు. మళ్ళీ యథాతధంగా నీ భక్తి మార్గాన్ని అనుసరించు. ఆలయాలను సందర్శించు. పూజలను ఆచరించు. అప్పటికీ కూడా నీకు దేవుని దర్శనం లభించకపోతే నేను ఖచ్చితంగా నీ మార్గాన్నే అనుసరిస్తాను. రేపటి రోజున ఇదే సమయానికి నీవు వచ్చే వరకు నేను ఈ మూట వద్ద వేచియుంటాను. నువ్వు నీ అభిప్రాయాన్ని నిరూపణ చేసిన తర్వాత మన ఇద్దరం కలసి ఈ మూటను లోయలో పడివేద్దాం అన్నాడు. 

వ్యాపారి తన కోసం కాకపోయినా సన్యాసికి అతను తెలుసుకున్న సత్యాన్ని ఎలాగైనా తెలియజేయాలని భావించి అందుకు ఒప్పుకున్నాడు. సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ వస్తాను అని, మూటను పడవేసేందుకు సిద్దంగా ఉండమని చెప్పి వ్యాపారి అక్కడి నుండి ఇంటికి బయల్దేరాడు. 

చీకటి పడేసరికి అతడు ఇంటికి చేరుకున్నాడు. భోజనం ముగించిన తర్వాత దేవుని మీద అచంచలమైన విశ్వాశంతో మనసులో ప్రార్ధించి నిద్రపోయాడు. అర్ధరాత్రిలో మేల్కొని కలలో అయినా దర్శనం ఇవ్వమని దేవుడిని పదే పదే వేడుకుని మళ్ళీ నిద్రపోయాడు. 

వేకువ జామున దేవుని ఆలోచనలతో నిద్ర మేల్కొన్నాడు. రాత్రి అంతలా వేడుకున్నా దేవుడు కనిపించలేదని వాపోయాడు. ఏదేమైనా సన్యాసికి ఇచ్చిన మాటకోసం మళ్ళీ దేవుడు ఉన్నాడు అనే విశ్వాసాన్ని హృదయంలో నింపుకున్నాడు. 

ఎప్పటిలాగానే భగవంతుని నామస్మరణ చేస్తూ ఆలయానికి బయల్దేరాడు. దారిలో పూజకు కావాల్సిన పుష్పాలను, ఫలాలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి ఆలయానికి చుట్టూ అలంకరించాడు. ఈరోజు దేవుడిని కనుగొనలేకపోతే ఇకపై ఇంకెప్పుడూ నా జీవితంలో దేవుడి ప్రస్తావన ఉండబోదు అనుకున్నాడు. winstrol injection for sale – real-steroids.biz తర్వాత దేవుడి ఆచూకీ కనుగొనే క్రమంలో గోపురం చుట్టూ వెయ్యి ప్రదక్షణలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఆలయంలో గోపురం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న వ్యాపారి, మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ దాటికి తట్టుకోలేక కళ్ళు బైర్లు కమ్మి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ సమయంలో ప్రాంగణంలోని ఒక భక్తుడు అతడిని లేవదీసి సపర్యలు చేయడంతో కోలుకున్నాడు. అయినప్పటికీ ఎలాగైనా ప్రదక్షణలు పూర్తిచేయాలని భావించి అతడు గోపురం చుట్టూ మళ్ళీ తిరగడం ప్రారంభించాడు. 

అతడు ప్రదక్షణలు పూర్తిచేసే సరికి దాదాపు సాయంత్రం అయింది. ఈరోజు దేవుడు ఎలా ప్రత్యక్షం అవ్వడో నేనూ చూస్తాను అని ధృడ విశ్వాసంతో వ్యాపారి ఇంటికి చేరుకున్నాడు. పూజ గదిలో దేవుని ఆచూకీ కోసం వెతికాడు, కానీ అక్కడ అతడికి ఏమీ కనిపించలేదు. తర్వాత అక్కడే తీవ్రమైన ధ్యాన ముద్రలో కుర్చుని దేవుని కోసం ధ్యానించాడు. అయినా ఏమీ ఫలితం లభించలేదు. చివరిగా బయటకు వచ్చి ప్రకృతిలో వెతికాడు.

అన్ని ప్రయత్నాలు చేసాక మరో గత్యంతరం లేక ఇక “దేవుడు లేడు-గీవుడు లేడు” అని బలమైన ధృడ నిశ్చయానికి వచ్చాడు. వేగంగా తన అడుగులను అడవిలోని సన్యాసి వైపుకి కదిపాడు. చీకటి పడే సమయానికి అతడు కొండమీద సన్యాసి వద్దకు చేరుకున్నాడు. 

A Short Moral Story in Telugu 2021

వ్యాపారి అక్కడకు చేరుకునే సరికి ఆ సన్యాసి పద్మాసనంలో ఎంతో ప్రశాంతంగా కుర్చుని ఉన్నాడు. వ్యాపారి అతను దగ్గరకి వెళ్లి “అయ్యా! మీరు చెప్పిన విధంగా శక్తి వంచన లేకుండా భక్తి మార్గంలో దేవుని అన్వేషణ కోసం అన్ని ప్రయత్నాలనూ చేసాను. చివరకు నా అభిప్రాయమే నిజం అయినది. ఈ సృష్టిలో దేవుడు అన్నవాడే లేడు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఆదా చేసుకోండి. నా జీవితం ఎలాగో వృధా అయిపోయింది” అన్నాడు.

వ్యాపారి మాటలను వింటున్న సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ నీ జీవితం ఇంకా వృధా కాలేదు. అంతా సజావుగానే ఉంది అన్నాడు. వ్యాపారి అతనికి దగ్గరగా వచ్చి మీరు ఏమంటున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు. సన్యాసి మాట్లాడుతూ అవును నీ జీవితం వృధా కాలేదు. నేను నా సూక్ష్మ దృష్టితో అంతా చూస్తున్నాను అన్నాడు. 

వ్యాపారి మాట్లాడుతూ “భక్తి అనే మత్తు మీ తలకు తీవ్రంగా ఎక్కింది. అందుకే మీరు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీ కోరిక మేరకు నా ప్రయత్నం నేను చేసాను. కానీ నాకు దేవుడు ఆచూకీ ఏమాత్రం లభించలేదు. కాబట్టి నేను సత్యాన్ని నిరూపించాను అని మీరు అంగీకరించాలి” అన్నాడు. 

“పిచ్చివాడా, భక్తి తలకు ఎక్కితే వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అజ్ఞానం తలకు ఎక్కితే నీవు ఏనాటికీ సత్యాన్ని తెలుసుకోలేవు. భగవంతుడు నీ కోరిక తీర్చడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతని ప్రయత్నం నీ భక్తి కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. మన కంటికి కనిపించని సూక్ష్మ జీవులను చూడాలంటే మనకి ఒక సూక్ష్మ దర్శిని అవసరం. అలాగే భగవంతుడిని దర్శించాలంటే సూక్ష్మ జ్ఞానం కలిగి ఉండాలి. అది మనలో లోపించినప్పుడు భగవంతుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయనని మనం తెలుసుకోలేము. 

ఈరోజు కూడా ఆయన నీకు కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ నీవు ఆయనని పట్టించుకోలేదు. అతనిని ఎంతో అశ్రద్ధ చేసావు. అయినప్పటికీ ఆయనకు నీ మీద పిసరంత కోపం కూడా లేదు. ఈ సమయంలో నువ్వు అతన్ని వదిలేస్తాను అన్నప్పటికీ ఇంకా నీకు దర్శనం ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు అన్నాడు. 

వ్యాపారి కాస్త శాంతించి “అయ్యా! మీ మాటలు నాకు ఎంతో ప్రశాంతతని కలిగిస్తున్నాయి. కానీ ఇవి ఏవీ వాస్తవాలు కాదు. భగవంతుడు నిజంగా ఉండి, నా మీద అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఒక్కసారి అయినా కనిపించాలి కదా. అతనిని దర్శించే సూక్ష్మ దృష్టి నాలో లేనప్పుడు మహిమాన్వితుడు అయిన పరమాత్మ నాకు కనిపించే రూపంలో దర్శనం ఇవ్వలేడా?” అని ప్రశ్నించాడు.

సన్యాసి అతడి మాటలకు నవ్వి నీ ప్రశ్నలోనే సమాధానం పెట్టుకుని మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నీవు ఆలయంలో గోపురం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ నీరసించి పడిపోతే స్వయంగా ఆ పరమాత్ముడే వచ్చి నీకు సపర్యలు చేసాడు. నీకోసం ఆయన తన సూక్ష్మ శరీరాన్ని విడిచి మానవ రూపాన్ని దాల్చాడు. అది నీవు గ్రహించ గలిగావా, నీవు ఆయనకి కనీసం కృతజ్ఞత కూడా తెలపలేదు.

నీవు ఆలయం నుండి బయటకు వస్తుంటే నీకోసం మెట్ల మీద బిచ్చగాడి రూపంలో చిరిగిన వస్త్రాలు ధరించాడు. మాసిన గడ్డంతో, వికృత రూపం దాల్చి నీవు జాలిపడే రూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా నీ నుండి దానాన్ని గ్రహించి నీ పూర్వ కర్మల నుండి విముక్తి కల్పించడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఆయనను నీవు నిర్లక్ష్యంతో అసహ్యించుకుని వచ్చేసావు.

అయినప్పటికీ నీ భక్తికి పరవశం చెందిన భగవంతుడు నీవు ఆలయం నుండి ఇంటికి వెళ్తున్న మార్గంలో నీతో కాసేపు ప్రయాణించాలని అనుకున్నాడు. నీ వాహనాన్ని ఆపి నీవు వెళ్ళే మార్గ మధ్యంలో అతన్ని దించమని కోరాడు. కానీ నీవు అతనిని నిరాకరించి వాహనం ఆపకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు గుర్తు తెచ్చుకో. ఆయన నీ జీవితంలో ఎన్నిసార్లు నీకు దర్శనం ఇవ్వాలని ప్రయత్నించాడో.

భగవంతుడు నిరాకారుడు. అతడు నిన్ను ఏ రూపంలోనైనా అనుగ్రహించగలడు. అతన్ని తెలుసుకునే సూక్ష్మ దృష్టి నీకు కలిగిన నాడు అణువణువునా నీకు అతని దర్శనం లభిస్తుంది అన్నాడు. 

వ్యాపారి లోపలి నుండి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చాడు. చేతులతో తల మీద బాదుకుంటూ మోకాలిపై మోకరిల్లి భగవంతుడిని క్షమించమని వేడుకున్నాడు. అతనికి సూక్ష్మ జ్ఞానాన్ని బోధించిన సన్యాసిని అతడి శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడుతూ అతని కాళ్ళ మీద పడ్డాడు. సన్యాసి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మోకాళ్ళపై నెమ్మదిగా పైకి లేచి చేతులు జోడిస్తూ దీనంగా అతడిని వేడుకుంటూ కళ్ళు తెరిచాడు. 

  • చివరి బోనస్‍గా క్రింది అద్భుతమైన కొటేషన్స్ చదవండి.
  • 50+ best quotes on life in telugu

ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఎవరూ లేరు. చుట్టు ప్రక్కల తిరిగి వెతికి చూసాడు సన్యాసి జాడ తెలియరాలేదు. స్వయంగా భగవంతుడే అతనికి సూక్ష్మ జ్ఞానం అందించడానికి సన్యాసి రూపంలో వచ్చాడు అని అతడు తెలుసుకున్నాడు. ఆనంద భాష్పాలతో ఏడ్చాడు. ఈ జన్మ సార్ధకం అయింది అని మహాదానందం అనుభూతి చెందుతూ సాధారణ సమాజంలోనికి తిరిగి అడుగు పెట్టాడు. 

ధర్మం, కృతజ్ఞత, దానం, సహకారం, గురుతత్వం భగవంతుడి ఉనికికి చిహ్నాలు. 

telugu samhitha

      

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!