క్రోధం
Best motivatonal story in telugu
అది ఒకానొక మహా నగరంలో అత్యంత రద్దీ ప్రదేశం. ఉరుకుల పరుగుల జీవిత ప్రయాణంలో నిమగ్నమైన ఒక వ్యక్తి చేతి గడియారంలో పదే పదే సమయాన్ని చూసుకుంటూ వేగంగా ముందుకు నడుస్తున్నాడు. ఒకవైపు వాహనాల మోత, మరోవైపు జన సందోహం వెరసి ఆ ప్రదేశం మనుషులు నడిచేందుకు కూడా ఎంతో క్లిష్టంగా ఉంది. Proviron for sale – sportlifepower.biz ఆ వ్యక్తి ఎంతో అలసటతో, ఆందోళనతో ఉన్నాడు. మొహం నుండి జారుతున్న చెమటని చేతి రుమాలుతో తుడుచుకుంటూ అడ్డు వచ్చినవారి మీద కసురుకుంటూ నడుస్తున్నాడు.

సరిగ్గా అదే రకమైన వేగిరపాటుతో, వేగంగా చేరుకోవాలన్న తపనతో ఆయాసపడుతూ మరో వ్యక్తి మొదటి వ్యక్తికి ఎదురుగా వేగంగా నడుచుకుని వస్తున్నాడు. ఆ ఇరువురు వ్యక్తుల యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం వారి వారి గమ్యాన్ని అనుకున్న సమయంలో చేరుకోవడమే. దగ్గరకి చేరుకోగానే రెండవ వ్యక్తి భుజానికి ధరించిన బ్యాగుతో మొదటి వ్యక్తిని అనుకోకుండా ఢీ కొట్టాడు. మొదటి వ్యక్తి అప్రయత్నంగా క్రింద పడ్డాడు.
క్రింద పడ్డ ఆ వ్యక్తి పేరు సందీప్ కృష్ణ. అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ రెండవ వ్యక్తి జరిగినదానికి క్షమాపణ చెప్పినప్పటికీ స్వభావరిత్యా కోపిష్టి అయిన సందీప్ కృష్ణ వెంటనే అతని మీద చేయిచేసుకున్నాడు. అంతటితో వారి ఇద్దరి మధ్య స్వల్పమైన వాగ్వివాదం మొదలైంది. క్రమేపి ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ భౌతిక దాడి చేసుకోవడం ప్రారంభించారు.

చుట్టూ జనం గూమిగూడారు. సందీప్ కృష్ణ తనలో కట్టలు తెంచుకుంటున్న కోపాన్ని నియంత్రించుకోలేని స్థితిలో తీవ్రమైన మానసిక పరిస్థితికి చేరుకున్నాడు. అతని ఆవేశం అతనిలోని ఆలోచనా జ్ఞానాన్ని పూర్తిగా వశపరచుకుంది. ఆ రెండవ వ్యక్తి అక్కడ నుండి నిష్క్రమించే ప్రయత్నం చేసినప్పటికీ అతడితో వివాదాన్ని ఆపలేదు.
సందీప్ కృష్ణ తొమ్మిది గంటలకు ఆఫీసుకు చేరుకోవాల్సి ఉంది. కానీ దాదాపు గంటన్నర ఆలస్యంగా చేరుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యమైతే అతని బాస్ దివాకర్ గంగిరెద్దు లాగా రంకెలు వేస్తాడని అతనికి బాగా తెలుసు. బిక్కు బిక్కు మంటూ ఆఫీసులోనికి నడవడం ప్రారంభించాడు. లోపలకి అడుగు పెట్టగానే అతని సహోద్యోగి అయిన మనోహర్ అతని దగ్గరకు వచ్చి నిన్ను బాస్ పిలిచారని చెప్పి వెళ్లిపోయాడు.

సందీప్ నెమ్మదిగా బాస్ రూమ్ దగ్గరకు వెళ్లి శ్వాసను గట్టిగా పీల్చుకున్నాడు. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. డోర్ ఓపెన్ చేసేందుకు హ్యాండిల్ పట్టుకున్నాడు. వెంటనే చేతిని వెనక్కి తీసాడు. మళ్ళీ శ్వాసను గట్టిగా తీసుకుని ఇలాంటి రోజు ఇంకెప్పుడు రాకూడదు అనుకుంటూ గుండెని ధృడ పరచుకుని లోపలకు అడుగుపెట్టాడు.
“సర్ క్షమించండి, చిన్న సమస్య వలన కాస్త ఆలస్యం అయ్యాను. ఇంకెప్పుడు ఇలా జరగదు అని సందీప్ కృష్ణ సంజాయిషీ చెప్పడం ప్రారంభించాడు. దివాకర్ వ్యంగ్యంగా నవ్వుతూ చేతిలోని పేపర్ వెయిట్ నేల మీదకు జారిపోతున్నట్టు ప్రయత్నపూర్వకంగా క్రింద పడేసాడు. పేపర్ వెయిట్ నేల మీద పడి చెల్లా చెదురుగా పగిలిపోయింది. “అయ్యో! ఎదో ఆలోచనలో జారిపడిపోయింది మిస్టర్ సందీప్. ఇలా జరిగినందుకు నాకు కుడా బాధగా ఉంది. ఇలా సంజాయిషీ చెప్తే పగిలిన వస్తువు తిరిగి చేరుతుందా. ఒకవేళ అవుతుందేమో ప్రయత్నించు, ఈ రోజు సాయంత్రం వరకు సమయం ఇస్తాను అన్నాడు.

సందీప్ కృష్ణ నోట మాట రాలేదు. దివాకర్ టేబుల్ మీద న్యూస్ పేపర్ తీసుకుని ఏమీ పట్టనట్టు చదువుకోవడం ప్రారంభించాడు. బయట పులిలా గాండ్రించే సందీప్ కృష్ణ తన బాస్ ఎదుట ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో పగిలిన గాజు ముక్కలను పోగేసి చేతిలో పట్టుకుని నెమ్మదిగా బయటకు వచ్చాడు.
బయటకు వస్తున్న సందీప్‌ను చూసి లోపల ఏమన్నారు అని ఆత్రంగా అడిగాడు మనోహర్. “సాయంత్రం లోగా పగిలిన ఈ గాజు పేపర్ వెయిట్‌ని అతికించి ఇవ్వమన్నారు” అని నీరసంగా చెప్పాడు సందీప్. “అంటే ప్రస్తుతం నిన్ను జాబ్‌లో నుండి తీసేసారు అన్నమాట అని భుజం మీద చేయి వేసి ఓదార్పుగా అన్నాడు మనోహర్.
సందీప్ కృష్ణ ఉద్యోగం పోయినందుకు దిగులుగా బయటకు వచ్చాడు. బయట చిన్నగా వర్షం కురవడం ప్రారంభం అయింది. అయినా తడుచుకుంటూ వచ్చిన దారిలోనే అతను ఇంటికి తిరిగి ముఖం పట్టాడు. ఇలా జరిగినందుకు ఉదయం ఎదురుపడిన వ్యక్తి మీద మరింత కోపంగా అతను కనిపిస్తే చంపేయాలని అన్నంత కసిగా అడుగులు వేస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగం పోయిందన్న బాధ, మరోవైపు అందుకు కారణమైన వ్యక్తి మీద కోపం వెరసి అతని అడుగులు తడబడుతున్నాయి.

జన సందోహంలో అకస్మాత్తుగా ఎవరో కింద పడ్డారు. అతను వెంట తెచ్చుకున్న గొడుగు గాలికి దూరంగా ఎగిరిపోయింది. పడిన వ్యక్తి చేతిలోని ముఖ్యమైన కాగితాలు చెల్లా చెదురుగా ఎగిరిపోయాయి. కొంతమంది వాటిని త్రొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆలోచన, ఆవేశాల మధ్య లీనమైన సందీప్ కృష్ణ ఒక్కసారి స్పృహ లోకి వచ్చాడు. అతని చేయి తగిలి ఆ వ్యక్తి క్రింద పడినట్టు అప్పుడు గుర్తు వచ్చింది. వెంటనే అతన్నిపైకి లేవదీసి “క్షమించండి, ఎదో ఆలోచిస్తూ మిమ్మల్ని ఢీ కొట్టాను” అన్నాడు క్రింద పడిన పేపర్లను తీస్తూ.
ఆ పేపర్లలో ఆ వ్యక్తికి సంబంధించిన విలువైన సర్టిఫికెట్లు కుడా ఉన్నాయి. వాటిని చూసి అతని పేరు శశిధర్ అని గ్రహించాడు సందీప్. సర్టిఫికెట్లు వర్షం కారణం చేత తడిసి బురద అంటుకున్నాయి. ఒక్కొక్కటిగా అన్నీ తీసి అతని చేతికి అందించాడు. సందీప్‌ను అతను తిట్టడానికి బదులుగా థాంక్స్ చెప్పాడు.

సందీప్ కృష్ణకు ఆశ్చర్యం వేసింది. నిజానికి అతని స్థానంలో నేనుంటే ఏం చేసేవాడినో ఊహించలేను అని మనసులో అనుకున్నాడు. “మీకు నా మీద కోపం లేదా” అని మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఒక ప్రశ్న అతనిని అడిగాడు. “ప్రస్తుతం నాకు సమయం లేదండి, ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను” అన్నాడు మరో ఆలోచన లేకుండా శశిధర్. “అయ్యో అవునా! క్షమించండి శశిధర్ గారు, ఇందాక మీ సర్టిఫికేట్లలో మీ పేరుని చూసాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీ ఫైలుని చుస్తే మీకు ఉద్యోగం వస్తుందో లేదో, అయినా నా మీద మీకు కోపంగా లేదా అని సందేహంగా అడిగాడు సందీప్ కృష్ణ.
భలే వారే, మీ మీద కోపం తెచ్చుకుంటే నాకు ఒరిగేది ఏముంటుంది. పైగా రోజంతా నా మనసు కలత చెందుతుంది. మీతో గొడవపడటం వలన ఇంటర్వూకి సమయానికి హాజరు కాలేను. సర్టిఫికేట్లకు బురద అంటడానికి అక్కడ వెయ్యి కారణాలు చెప్పవచ్చు కానీ అనుకున్న సమయానికి ఇంటర్వ్యూకి హాజరు కాకపోతే మనకి కారణం చెప్పుకోవడానికి ఒక్క అవకాశం కుడా మిగలదు.
అయినా మీరు వెంటనే క్షమించమని అడిగారు, అయినా కోపం తెచ్చుకుని గొడవ పడే ఆస్కారం ఉంటుందా? ఒకవేళ నేను మీతో గొడవ పడి ఉంటే కనీసం ఈ పేపర్లను చేతికి అందించడానికి మీ సహాయాన్ని కుడా కోల్పోయేవాడినేమో!” అన్నాడు.

“శశిధర్ గారు, మనం అలా ఆలోచిస్తే ఎదుటి వారు మనకంటే గొప్పవారుగా భావించి పెత్తనం చేయాలని చూస్తారు కదా, వాళ్ళు మన మీద పైచేయి సాధిస్తారు కదా?” అన్నాడు ప్రశ్నార్ధకంగా.
“ప్రతీ వ్యక్తి ఇతరులపై పైచేయి సాధించేందుకు, తాము ఇతరుల కంటే గొప్పవారమని భ్రమ పడతారు. ఆ భ్రమలో వారిని అహం కమ్మేస్తుంది. అహం అనే మత్తులో కోపానికి బానిసలు అవుతారు”.
తెలుగు సంహిత
శశిధర్ కోపం తెచ్చుకోవడం వలన జరిగే అనార్ధలను, కోపాన్ని నియంత్రించుకోవడం వలన కలిగే ప్రయోజనాలను చెప్తూ “సరే, మీరు పైచేయి సాధించాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటారు. ఆ వ్యక్తిపై పైచేయి సాధించడం మినహాయించి ఇంకేదైనా ప్రయోజనం పొందినట్టు మీ అనుభవంలో జరిగితే నాకు చెప్పండి” అన్నాడు శశిధర్.
సందీప్ కృష్ణ ఆలోచనలో పడ్డాడు. ఆ అనుభవం రెండు గంటల ముందే జరిగింది. ఆ వ్యక్తి మీద పైచేయి సాధించడం వలన నాకు ఒరిగింది ఏమీలేదు కాని ఉన్న ఉద్యోగం కాస్త ఊడింది అని మనసులో అనుకున్నాడు. వెంటనే ప్రస్తుతం లోనికి వచ్చి ప్రయోజనం ఏమీ లేదు అన్నట్టు తలను ఊపాడు సందీప్ కృష్ణ.
Anger slavers
“మనం పైచేయి సాధించాలనుకున్న వ్యక్తి జీవితంలో తిరిగి మనకు తారస పడతాడో లేదో మనకి తెలియదు. కానీ మనం పైచేయి సాధించేందుకు అతనిపై ప్రయోగించిన కోపానికి ఫలితం మనకి జీవితాంతం వెంటాడుతుంది”
తెలుగు సంహిత
పూర్తిగా సర్దుకున్న తన ఇంటర్వ్యూ ఫైలును మరోసారి బాగా శుభ్రం చేసి “సరే, నాకు ఆలస్యం అవుతోంది. ఇంటర్వ్యూకి వెళ్తాను” అన్నాడు శశిధర్. “మీరు ఏమీ అనుకోను అంటే మీతో పాటు నేను కూడా ఇంటర్వ్యూ వరకు వస్తాను” అని మనసులో మెదులుతున్న మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు అడిగాడు సందీప్ కృష్ణ.

సందీప్ కృష్ణ, శశిధర్ మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకున్నారు. అలా వాళ్ళిద్దరూ దారిలో మంచి స్నేహితులు అయ్యారు. సందీప్ కృష్ణ బయట వేచియుంటాను అని చెప్పి శశిధర్‌ను ఇంటర్వ్యూకి పంపించాడు. కాసేపయ్యాక శశిధర్ బయటకి వచ్చాడు. సందీప్ కృష్ణ తన వలన జరిగిన నష్టానికి శశిధర్‌కు ఉద్యోగం వస్తుందో లేదో అని సందేహంతో ఉన్నాడు. అతడు బయటకి రాగానే “ఏమైంది?” అని సంశయంగా అడిగాడు.
శశిధర్ దిగులుగా చూసి, “క్షమించండి మిస్టర్ సందీప్ కృష్ణ. నాకు మీ వలన ఉద్యోగం రాదు అనే న్యూనతాభావన ఇకపై మీకు ఉండకూడదు. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం మీ వలెనే వచ్చింది” అని ముఖంలోని హావభావాలను సంతోషంగా మారుస్తూ అన్నాడు.
సందీప్ కృష్ణకు ఏమీ అర్ధం కాలేదు. “అసలు ఏం జరిగింది ఇంటర్వ్యూ” అని ఆశ్చర్యంగా అడిగాడు. “ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి సర్టిఫికేట్లలో ఉండే సమాచారానికి బదులు దానికి అంటుకున్న బురద మీద ఎక్కువ ప్రశ్నలు వేయాల్సి వచ్చింది. అంటే అది వారి దృష్టిని మరల్చి వారి జ్ఞానానికి బురద పట్టించింది” అన్నాడు సరదాగా.
“అంటే కొంపతీసి బురద మీద ప్రశ్నలు వేసారా?” అని ఆదుర్దాగా అడిగాడు సందీప్ కృష్ణ. దాదాపుగా అంతే అన్నట్టు నిట్టూర్చాడు శశిధర్. మరి వాటి అన్నిటికీ సమాధానం చెప్పగలిగారా అని మళ్ళీ కుతూహలంతో అడిగాడు సందీప్. “అది చాలా సులభం. రోజూ టీవీలో డిటర్జెంట్ ప్రకటనలు చాలా చూస్తున్నాంగా” అని నవ్వుతూ అన్నాడు శశిధర్.
రెండు రోజుల తర్వాత

సందీప్ కృష్ణ ఉద్యోగ ప్రయత్నంలో ఒక ఇంటర్వ్యూ కోసం బయల్దేరాడు. మళ్ళీ అదే జన సందోహం. చేతిలో ఒక ఫైలు పట్టుకుని గబగబా అడుగులు వేస్తున్నాడు. ఈసారి గంగిరెద్దు లాంటి బాస్ కాకుండా గంగి గోవు లాంటి బాస్ దొరకాలని మనసులో దేవుడ్ని వేడుకున్నాడు. బాగా ఎండ కాస్తోంది. ఎండలో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అడుగులు మళ్ళీ తడబడుతున్నాయి. ఈసారి ఎవర్నీ ఢీ కొట్టకూడదు అని ధృడ నిశ్చయంతో తనని తాను గిల్లుకుని పూర్తి స్పృహతో ముందుకు నడుస్తున్నాడు.
అక్కడకి రెండు నిముషాలలో సందీప్ కృష్ణ నేల మీద పడి ఉన్నాడు. చేతిలోని ఫైలు గాలిలోకి ఎగిరి కాగితాలు చెల్లా చెదురుగా పడుతున్నాయి. “నేను మళ్ళీ ఎవరినైనా ఢీ కొట్టేసానా” అని గట్టిగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా తెరవడం ప్రారంభించాడు. ఓ వ్యక్తి ఆత్రుతగా చెదిరిన ఆ కాగితాలను సేకరించి తనవైపుకి తీసుకుని వస్తున్నాడు. “హాలో, ఎదో పొరపాటున ఢీ కొట్టాను, క్షమించండి” అని ఆ వ్యక్తి తన చేతిని అందించాడు.
సందీప్ కృష్ణ అతను ఎవరో చూడకుండా తన చేతిని ఇచ్చాడు. పైకి లేచాక బట్టల్ని దులుపుకుంటూ చేతిలో పేపర్లు పట్టుకున్న ఆ వ్యక్తిని చూసాడు. అతను తన ఉద్యోగం పోవడానికి కారణమైన మొదటి వ్యక్తి. వెంటనే అతన్ని పలకరిస్తూ “ఓహ్, మళ్ళీ మీరేనా,” అన్నాడు సందీప్ కృష్ణ. ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. నిజానికి అతను కూడా సందీప్ కృష్ణని చూడలేదు. చుస్తే అతనికి సహాయం కూడా చేయకుండా వెంటనే పారిపోయేవాడు. “ఈరోజు కుడా నా పని అయిపోయింది” అని మనసులో అనుకుంటూ సందీప్ కృష్ణను చూసి వెకిలి నవ్వు నవ్వాడు.
సందీప్ కృష్ణ అతని వైపు చూసి మీకు క్షమాపణ చెప్పాలి అన్నాడు. అతను హావభావాలను మార్చి “ఎందుకు?” అని అడిగాడు. “మీకో విషయం తెలుసా, మొన్న జరిగినదానికి నా ఉద్యోగం పోయింది” అన్నాడు సందీప్ కృష్ణ. ఆ వ్యక్తికి మళ్ళీ ఆందోళన ప్రారంభం అయింది. తన రెండు చెంపలకు అర చేతుల్ని అడ్డంగా పెట్టుకుని ఒక మామూలు చిన్న సమస్యకే అంతలా రాద్దాంతం చేసిన వ్యక్తి ఉద్యోగం పోయిందంటే ఎలా స్పందిస్తాడో అని బిక్కు బిక్కుమని చూస్తున్నాడు.

“ఆరోజు నాకు ఉద్యోగం పోవడం వలన చండశాసనుడు లాంటి మా బాస్ నుండి నాకు విముక్తి లభించింది. బయటకు వచ్చాక ఒక మంచి స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతను నాలోని లోపాలను స్పష్టంగా ప్రతిబింభించే దర్పణం లాగా నాకు దారి చూపించాడు. ఇప్పుడు నేను మానసికంగా చాలా ధృడంగా ఉన్నాను. ఇకపై ఏ వ్యక్తీ నా మానసిక ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేయలేడు” అన్నాడు. (అనగా ఇతరులపై పైచేయి సాధించే ప్రయత్నంలో కోపానికి బానిస కావడం వలన మానసిక ప్రశాంతతని కోల్పోవడం జరగదు అని అర్ధం)
ఆ వ్యక్త్యి సందీప్ కృష్ణ చెప్పిన మాటలు తనకు కుడా వర్తిస్తాయని మనసులో అనుకున్నాడు. అతని మనసులో మెదులుతున్న మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు “మిస్టర్ సందీప్ కృష్ణ (సర్టిఫికేట్లలో పేరుని గ్రహించి) మీతో ఇంటర్వ్యూ వరకు వస్తాను” అన్నాడు ఆ వ్యక్తి. “సరే, ఇంతకి మీ పేరు తెలుసుకోవచ్చా? అని అడిగాడు సందీప్. అనుదీప్ అని అతను సమాధానం చెప్పాడు.
సందీప్ కృష్ణ మరియు అనుదీప్ మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకున్నారు. అలా వాళ్ళిద్దరూ దారిలో మంచి స్నేహితులు అయ్యారు. అనుదీప్ బయట వేచియుంటాను అని చెప్పి సందీప్ కృష్ణను ఇంటర్వ్యూకి పంపించాడు. కాసేపయ్యాక సందీప్ కృష్ణ బయటకి వచ్చాడు. అనుదీప్ తన వలన జరిగిన నష్టానికి సందీప్ కృష్ణకు ఉద్యోగం వస్తుందో లేదో అని సందేహంతో ఉన్నాడు. అతడు బయటకి రాగానే “ఏమైంది” అని సంశయంగా అడిగాడు. (శశిధర్ మార్గంలోనే బహుశా ఉద్యోగం వచ్చింది)
రెండు రోజుల తర్వాత అదే రద్దీ ప్రదేశంలో

చేతిలోని ఫైలు గాలిలోకి ఎగిరి కాగితాలు చెల్లా చెదురుగా పడుతున్నాయి. “నేను మళ్ళీ ఎవరినైనా ఢీ కొట్టేసానా” అని అనుదీప్ గట్టిగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా తెరవడం ప్రారంభించాడు. ఓ వ్యక్తి ఆత్రుతగా చెదిరిన ఆ కాగితాలను సేకరించి తనవైపుకి తీసుకుని వస్తున్నాడు. “హాలో, ఎదో పొరపాటున ఢీ కొట్టాను. క్షమించండి” అని ఆ వ్యక్తి అనుదీప్ కు తన చేతిని అందించాడు.
పరిచయాలు ఇంచుమించుగా యాదృచ్చికంగా జరుగుతాయి. మీ ప్రాధమిక ప్రతిస్పందన వాటి స్థాయిని, కాలపరిమితిని నిర్ణయిస్తుంది.
చాలా మంది ఒక చిన్న క్షమాపణతో తీరిపోయే సమస్యలను అహంతో ఎదుటి వారి మీద పైచేయి సాధించాలని తెగేవరకు లాగుతారు. దాని వలన మానసిక ప్రశాంతతని కోల్పోవడం తప్ప ఒరిగింది ఏమీ లేదు.
“సాధారణంగా ప్రజలు తన కంటే తక్కువ వారి వద్ద పెత్తనం ప్రదర్శిస్తారు. తనకంటే ఎక్కువ వారి వద్ద అణిగి మణిగి ఉంటారు. ఇతరులపై మీ పెత్తనం ద్వారా మీరు గొప్పవారని అపోహపడే ముందు మీపై ఇతరుల పెత్తనం ద్వారా మీ స్థాయిని బేరీజు వేసుకోండి”.
తెలుగు సంహిత