ఆత్మ స్థైర్యం
An Inspirational Story about Success
విజయం…కష్టానికి Testosterone Cypionate in USA – pumpers.co ప్రతిఫలం, ప్రయత్నానికి సఫలం, కలలకు సాఫల్యం.. మరి విజయానికి వైఫల్యం ఎందుకు? విజయం కేవలం కొందరి సొత్తేనా? ఎల్ కేజీ పిల్లవాడి నుండి ఎమ్.ఎస్ విద్యార్ధి వరకు, బిల్ కలెక్టరు నుండి బిజినెస్ మ్యాన్ దాకా, ఆటగాడు, వేటగాడు, రాత పరీక్షలు, రాజకీయాలు “కాదేదీ కవితకనర్హం” అనే శ్రీ శ్రీ మాట గుర్తు చేసేలా విజయానికి అర్హతలు ఉంటాయా? లేవు అనుకుంటే విజయం కొందరికి మాత్రమే సొత్తు ఎలా అవుతోంది.
గూడర్ధాలు లేవు, పెడర్ధాలు లేవు, రహస్యాలు లేవు, రాద్ధాంతాలు లేవు. మీరు హాస్యం అనుకున్నా, పరిహాస్యం అనుకున్నా విజయం మీ చిటికెన వ్రేలు చివరలోనే ఉంది. జారిపోకుండా చేతిలోకి తీసుకునే నైపుణ్యం మీకు ఉందా? అయితే అది మీ సొంతం, మీరు వదిలేసినా అది మిమ్మల్ని వదలదు. వెతుక్కుంటూ మీ చెంతకి చేరుతుంది. విజయం మీ సొత్తు, మీ ఒక్కరి సొత్తు. ఎలా అంటారా, అయితే ఈ కథను చదవండి.
ప్రకాష్ అనే వ్యక్తి తన డిగ్రీ పూర్తవగానే పోటీ పరీక్షలకి ఒక ప్రణాళిక పెట్టుకుని చాలా కష్టపడి ఆరు నెలలు చదివాడు. అనుకున్నట్టుగానే పరీక్ష సమయం వచ్చింది. ఆ ఉద్యోగం అతనికి ఎంతో అవసరం. కానీ వస్తుందో లేదో అన్న భయంతో పాటు ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలి అన్న కసితో పరీక్ష హాలులోకి వెళ్ళాడు.

మీ లక్ష్యాన్ని మళ్ళించే ఆందోళనలు
అక్కడ చాలా మంది వ్యక్తులు తనలాగానే ఆందోళనగా కనిపిస్తున్నారు. కొందరు తనకంటే బాగా చదివిన వాళ్ళలాగా ఉన్నారు. ప్రకాష్‌కి ఇంకో సందేహం మొదలయింది. ఇక్కడ నాకంటే బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూస్తే పేజీలకు పేజీలు వస పట్టిన వాళ్ళ లాగా ఉన్నారు. నేను ఉన్న ఈ ఒక్క గదిలోనే ఇంత మంది ఉంటే దేశం మొత్తం మీద ఎంత మంది ఉంటారు? అంత మందిలో కేవలం స్వల్ప పోస్టుల కోసం జరిగే ఈ పరీక్షలో ఒక సాధారణ విద్యార్ధిని అయిన నేను నెగ్గగలనా? అనుకున్నాడు.
వెంటనే ప్రకాష్‌కు ఉన్న ఆర్ధిక సమస్యలు గుర్తొచ్చాయి. ఉద్యోగం తనకి చాలా అవసరం. ఈ ఆరు నెలలు తను ఎంత ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివాడో గుర్తు చేసుకున్నాడు. ఊపిరి గట్టిగా తీసుకుని ప్రశాంతంగా ఆలోచనలు పక్కకు మరల్చాడు. పరీక్ష ప్రారంభమయింది. అందరి లాగానే పరీక్ష రాసి బయటకి వచ్చాడు.

సామర్ధ్యం మీద విశ్వాసాన్ని కోల్పోవడం
ఒక చెట్టు కింద మాట్లాడుకుంటున్న నలుగురి వ్యక్తుల సంభాషణ వింటూ అలా పక్కన నిల్చున్నాడు. అందులో ఒక వ్యక్తి “ప్రశ్నలన్నీ చాలా సులభంగా ఇచ్చారు. దాదాపుగా నేను సెలెక్ట్ అవొచ్చు” అని అన్నాడు. మరో వ్యక్తి “నేను కూడా అన్నిటికి బాగానే రాసాను” అన్నాడు. అంతలో ఇంకో వ్యక్తి మాత్రం “ప్రశ్నలన్నీ చాలా తికమకగా ఇచ్చారు, అన్నిటికీ సమాధానం ఇచ్చామనే అనుకుంటున్నాం. కానీ తార్కికంగా అవి మనల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాయి. కాబట్టి సెలక్టు అవుతామనే నమ్మకం నాకు లేదు” అన్నాడు. ఈ మాటలన్నీ విన్న ప్రకాష్ తను బాగా రాసాడో లేదో తెలియక తికమక పడుతూ వెళ్ళిపోయాడు.
విజయం నీ వెంటే
ప్రకాష్ కి ఆ ఉద్యోగం వస్తుందనే నమ్మకం పోయింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం తన వల్ల కాదు అనుకున్నాడు. కానీ తనకి ఉన్న సమస్యలను ఎలాగైనా దాటాలి. అందుకోసం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకున్నాడు. వచ్చే అంతంత మాత్రం జీతంతో ప్రణాళికతో తన సమస్యలను తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ తన అవసరాలు ఆదాయానికి మించి ఉన్నాయి. ఆ విధంగా కొంతకాలం గడిచింది.

అరిగిన చెప్పులు, మాసిన గడ్డం, నిలువెత్తు నిరుత్సాహం, ఎటు పడుతున్నాయో తెలియని అడుగులతో మండుటెండలో ఒంటరిగా నడుచుకుంటూ ప్రకాష్ తుప్పు పట్టిన తన ఇంటి గేటు గొళ్ళెం తీసి లోపలకి అడుగు పెట్టాడు. జీవితంలో ఓడిపోయాను అనే అపరాధభావన అతని మొహంలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. అంతలో కిటికీ సందులోంచి క్రింద పడిన ఒక కవర్ అతని కంటపడింది. ఐదేళ్లుగా ఉద్యోగ సాధనలో విసిగి వేజారిన అతని మనస్సు సర్వ సాధారణమైన ఉత్తర ప్రత్యుత్తరాలకు ప్రతిస్పందించడంలో డీలా పడిపోయింది. దానిని అక్కడే ఉపేక్షించి అక్కడకు రెండు మీటర్ల దూరంలో ఎదురుగా వేసిన కుర్చీలో కూర్చుని పైకి చూస్తూ సేద తీరుతున్నాడు.
నేను ఓడిపోయాను, ఇక ఈ ప్రయత్నం నుండి నిష్క్రమించే సమయం వచ్చింది అన్న ఆలోచనలు అతని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అప్రయత్నంగా అతని చూపు ఆ ఉత్తరం వైపుకి మళ్ళింది. అది తెరిచి మరోసారి నిరుత్సాహం పొందడం అతనికి ఇష్టం లేదు. అయినప్పటికీ తన ప్రయత్నానికి ఫలితం ఏదైనా స్వీకరించడం బాధ్యత అని తనని తాను వారించుకున్నాడు.
నెమ్మదిగా లేచి రెండు అడుగులు ముందుకు వేసి ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు. ఉత్తరం మీది చిరునామా చూసాడు. అతని చేతులు వణుకుతున్నాయి. ఆందోళనతో చెమటలు పడుతున్నాయి. ఊపిరి నిట్టూర్చి నెమ్మదిగా కవరు చించి లేఖను చదవనారంభించాడు. అందులో “డియర్ ప్రకాష్, మీరు క్లర్కు ఉద్యోగ ఎంపికలో నిర్వహించిన రాత పరీక్షకు ఉత్తీర్ణులయ్యారని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అందుకుగాను మీకు శుభాకాంక్షలు. పది రోజులలోపు మీరు ఈ ఉద్యోగంలో చేరవచ్చు” అని ఉంది.
అది తన పేరుతో వచ్చిన అపాయింట్మెంట్ లెటర్. ఆరు నెలల క్రితం తను రాసిన పరీక్ష ఫలితం. అప్పుడు అతనికి అర్ధమయింది, లక్షల మందిలో అతను ప్రత్యేకం అని. “నేను సాధించాను” అని ఎగిరి గంతులు వేసాడు. ఇన్నాళ్ళు తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికిందని ఆనందంతో ఏడ్చాడు. అనుకున్న సమయానికి ఉద్యోగంలో చేరాడు.
విజయం నీ సొత్తు
ప్రకాష్‌కు ఉద్యోగ భద్రత లభించింది. అందరి ఉద్యోగుల మాదిరిగానే రోజువారి దినచర్యలలో భాగస్వామ్యం అయ్యాడు. కానీ ఎదో దిగులు ప్రకాష్ కి మొదలయింది. ఇంకా ఎదో సాధించాలనిపించింది. ఆ ఉద్యోగం చేస్తూనే మరో ఉద్యగం కోసం చదవడం ప్రారంభించాడు.
మనిషి ఆశా జీవి, నిజానికి ప్రకాష్ కోరుకున్నది మరో ఉన్నతమైన ఉద్యోగం. అయినప్పటికీ ఈ విజయం అతనికి ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహమే లేదు. పని చేస్తూ మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలను ప్రారంభించాడు. ఇది వరకు రోజుకు పద్నాలుగు గంటలు చదివిన అతనికి ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరుకునేందుకు చదవడానికి అంత సమయం లేదు. ఉద్యోగంచేస్తూ దొరికిన కాస్త సమయంలో పరీక్ష కోసం చదవడం ప్రారంభించాడు.
మరో నలభై రోజుల్లో పరీక్ష సమయం రానే వచ్చింది. పరీక్ష రాసి ప్రకాష్ యథావిధిగా ఉద్యోగంలో కొనసాగాడు, అయితే ఇదివరకు అతనికి పరీక్ష సమయంలో ఎన్నో ఆందోళనలు ఉండేవి. కానీ ఈ సారి అటువంటి ఆందోళనలు ఏవీ అతగాడి దరికి చేరకపోవడం గమనించాడు. విజయానికి పునాది ఒక చిన్న విజయంతో ప్రారంభం అవుతుందని అర్ధం చేసుకున్నాడు. అందరి కంటే భిన్నంగా సులువుగా పరీక్ష రాసాడు.
మూడు నెలల తర్వాత ఆ ఉద్యోగం తనకే వచ్చినట్లు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ప్రకాష్ అప్పటికీ కూడా సంతృప్తి చెందలేదు. అతడు ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాడు. కానీ ఈ సారి విచిత్రంగా ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసేసాడు. మరో మూడు నెలల్లో ఆ పెద్ద ఉద్యోగంలో ప్రకాష్ వెలిగిపోయాడు. ఇప్పుడు అది కూడా రిజైన్ చేసాడు…. (ఎందుకంటే ఇప్పుడు విజయం తన సొత్తు).
సమీక్ష
ప్రకాష్ కి మొదట పరీక్ష రాసినపుడు లేనిది ఇప్పుడు ఉన్నది తన మీద తనకి ఉన్న ఆత్మ విశ్వాసం. మొదటి పరీక్షలో బాగా రాసినా ఆత్మ విశ్వాసం లేదు, రెండవ పరీక్షలో పాక్షిక ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. అందుకే ఈ ఉద్యోగం రాకపోయినా ఇది వరకు ఉన్న ఉద్యోగం చాలు అనుకున్నాడు. మూడవ పరీక్ష రాసేనాటికి సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు. ఆ ఉద్యగం నాకోసమే ఉన్నది. ఈ ప్రస్తుత ఉద్యోగం వదిలేసినా పర్వాలేదు అనుకున్నాడు.
జీవితంలో చాలా మంది విజయం కోసం కష్టపడుతుంటారు. కొందరు అన్నీ ఉన్నా తన మీద తనకి నమ్మకం లేక వెనుకంజ వేస్తారు. మీ కృషికి తగ్గ ఆత్మ విశ్వాసం తోడయితే మిమ్మల్ని అడ్డుకునే శక్తి లేదు. విజయం మీ సొత్తు, మీ ఒక్కరి సొత్తు. కానీ ఒక్క విషయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం గెలుపు అనే కిరీటానికి మకుటం వంటిది. లేదంటే ఒక్కోసారి విజయోత్సాహం కుడా అబాసుపాలు కావచ్చు.

ఎదగడంలో కన్నా ఒదగడంలో మిన్న
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ తన కెరీర్‍లో దూసుకుపోతున్న సమయంలో ఒకసారి విమానంలో విదేశాలకు వెళ్తున్నారు. ఆ విమానంలో తన పక్క సీట్‌లో ఒక పెద్దాయన కూర్చున్నారు. ఆయన తెల్లని చొక్కా, లాగు వంటి సాధారణ వస్త్రాలు ధరించి చూడటానికి మధ్య తరగతి చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నారు.
మిగిలిన ప్రయాణికులు అందరికీ అమితాబ్ ఎవరో తెలుసు. కానీ ఆ పెద్దాయన అమితాబ్‌ని పట్టించుకోలేదు. అతను న్యూస్ పేపరు చదువుతూ, కిటికీలోంచి బయటకు చూస్తూ ఎదో ఆలోచిస్తూ ఉన్నారు. దాదాపు ఐదుగంటలు ప్రయాణం కొనసాగింది ఆ వ్యక్తి అమితాబ్‌ను చూసినప్పుడల్లా చిన్నగా నవ్వు తప్ప ఏమీ కనిపించలేదు.
అమితాబ్‌కి పిచ్చెక్కిపోయింది. అమితాబ్ మనసులో ఇలా అనుకున్నారు “నేనెంత సెలబ్రిటీని, అందరూ నన్ను చూడాలంటేనే ఎంతగానో ఎగబ్రాకుతారు. కానీ ఈ పెద్దాయన ఏంటి అసలు నన్ను పట్టించుకోడు” అని గర్వంతో “సరేలే, ఆయనకి బహుషా నేనెవరో తెలీయదేమో, నేను ఎవరో అతనికి చెప్పి చూద్దాం” అని అనుకున్నారు.
అతనితో మాట కలిపేందుకు అమితాబ్ అతన్ని చూసి నవ్వారు. దానికి అతను తిరిగి నవ్వుతూ “హలో” అని పలకిరించారు. అలా ఇద్దరి సంభాషణ మొదలైంది.

‘మీరు సినిమాలు చూస్తారా?” అని అమితాబ్ అడిగారు. దానికి ఆయన సమాధానంగా, “ఓహ్, ఎస్, కాకపోతే చూసి చాలా ఏళ్ళు అయింది” అని అన్నారు. నేను మూవీ ఇండస్ట్రీలో పని చేస్తున్నాను అని అమితాబ్ తన గురించి చెప్పాలని ఆరాటపడుతూ అన్నారు. దానికి ఆయన, “ఓహ్, అవునా! ఏం చేస్తుంటారు” అని అడిగారు. “నేను ఒక యాక్టర్” అని అమితాబ్ సమాధానం చెప్పారు. దానికి ఆ పెద్దాయన తడబడుతూ “అవునా? అద్భుతం” అని అన్నారు. ఇంతలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. దిగడానికి సిద్ధపడుతూ అమితాబ్ తన పేరు కూడా అతనికి చెప్పాలని ఉత్సాహంతో “మీతో ఇది ఒక మంచి ప్రయాణం, బై ద వే, నా పేరు అమితాబచ్చన్” అన్నారు. అప్పుడు ఆ పెద్దాయన చిరునవ్వుతో “థాంక్యూ! మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. నేను జే.ఆర్.డీ టాటా” అన్నారు. ఆ దెబ్బకి అమితాబ్ కళ్ళు తిరిగాయి. ఇంతసేపు నేను ప్రయాణం చేసింది ప్రపంచమే గర్వించదగ్గ టాటా గ్రూప్స్ అధినేత, జే.ఆర్.డీ టాటా గారితోనా? ఆ క్షణం అమితాబ్ తన అహంకారానికి ఎంతో సిగ్గుపడినట్లు స్వయంగా తన పుస్తకంలో రాసుకుని, ఒదిగి మరోసారి ఎదిగారు.
మీ ఆలోచనలో మీరు ఎంత గొప్పవారు అన్నది విషయమే కాదు, ఎందుకంటే మీకంటే గొప్పది ఎదో ఒకటి ఉండనే ఉంటుంది. వినయంగా ఉండండి, పోయేది ఏమీ లేదు”
అమితాబ్ బచ్చన్
Wahh story boss
Thank you