జీవన వినిమయం

Best telugu moral stories 2021

భారతదేశానికి దక్షిణ తీరాన ఒక చిన్న పట్టణంలో ఒక పాతికేళ్ళ యువకుడు ఉండేవాడు. సంపదలపై తనకున్న అమితమైన ప్రేమతో అతని పదమూడవ ఏట నుండి చేయని ప్రయత్నమే లేదు. అందుకోసం అతని బాల్యపు సంతోషాలని, స్నేహితుల ముచ్చటలని, ఆటపాటలన్నిటిని త్యాగం చేసాడు. ఎంత ప్రయాసపడినా అతను అపర కుబేరుడు అవ్వాలన్న ఆశ అంచుకి కూడా చేరుకోలేకపోయాడు.  

Best telugu moral stories 2021

ఒక రోజు బిక్షాటనకు వచ్చిన ఒక పండు ముసలి సన్యాసి బిక్ష కోసం వస్తూ దీర్ఘాలోచనలో ఉన్న ఆ యువకుని వద్ద నిలిచి యాచించాడు. బిక్షగాడిని చూసి ఆ యువకుడు మిక్కిలి కోపంతో అతని జీవితాన్ని చులకన చేస్తూ హేళన చేసాడు. మీ బోటి యాచకులను చూడటం కూడా పాపం అని, దాని వలన అపరకుబేరుడు అవ్వాలన్న తన ఆశయంలో నిరుత్సాహం కలుగుతుందని తిట్టి పంపించబోయాడు. 

యువకుని అభిలాషను గమనించిన ఆ ముసలి సన్యాసి దానికోసం అతని వద్ద ఒక మార్గం ఉందని, దానిని అనుసరించడం వలన అనుకున్నది తప్పక నెరవేరుతుందని చెప్పాడు. వృద్దుని మాటలకు చిరాకు పడుతూ ఆ యువకుడు నిజంగా అన్ని మార్గాలు నీకు తెలిస్తే నా వద్ద ఇలా చేతులు చాచి యాచించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించాడు. 

ముసలి సన్యాసి చిన్నగా నవ్వి కుబేరుడు కావాలన్నది నీకు మాత్రమే ఆశయం, నాకు అలాంటి ఆశయం లేదు అన్నాడు. యువకుడు ఆశ్చర్యపోయాడు. ఈ భూమిపై డబ్బుని ప్రేమించని మనిషి ఉంటాడా అని అనుకున్నాడు. అతనికి తెలిసి అలాంటి వారు ఉండటం అసాధ్యం. కనుక వృద్దుని మాటలు నమ్మసఖ్యంగా లేవని భావించి సమయాన్ని వృధా చేయకుండా వెళ్లిపొమ్మని గట్టిగా అరిచాడు. ముసలి సన్యాసి ఆ యువకుని వంక తదేకంగా చూసి పదమూడేళ్ళ వయసు నుండి ప్రయత్నిస్తున్నావు. కాలం కలిసొచ్చి అదృష్టం నిన్ను వరించి దగ్గరకు వస్తే అజ్ఞానంతో జార విడుస్తున్నావు. అంతా నీ దురదృష్టం, ఇక నీ ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

Best telugu moral stories 2021

యువకునిలో ఆలోచన మొదలైంది. ఇంతవరకు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు చేసాను. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపాను. ఎన్నో వైఫల్యాలను చవిచూసాను. చివరికి కోట్లు సంపాదించడానికి అక్రమ దారులలో కూడా ప్రయత్నించి చూసాను. నిజంగా దురదృష్టం నన్ను వెంటాడుతోంది. ఒకవేళ నిజంగా అదృష్టం తలుపు తడితే, నేను దానిని జారవిడిస్తే నా కంటే దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండబోడు అని ఆలోచించాడు.

ఉన్నఫలంగా లేచి పరుగు పరుగున వెళ్లి ముసలి సన్యాసి కోసం వీధి వీధిన వెతకడం ప్రారంభించాడు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. చుట్టు ప్రక్కల వారిని, ఇరుగుపొరుగు వారిని అతని కోసం ఆరా తీసాడు. ఎవరూ అటువంటి సన్యాసిని చూడలేదని చెప్పారు. అతడికి ఆశ్చర్యం వేసింది. అంత వృద్దుడైన వ్యక్తి అంత త్వరగా ఎక్కడకి వెళ్లిపోయాడని ఆలోచిస్తూ ఇంటికి చేరుకొని నీరసించి గడపలో కూర్చునాడు. 

Best telugu moral stories 2021

కాసేపట్లో ముసలి సన్యాసి మళ్ళీ అతని గడప వద్దకు వచ్చి నిలిచాడు. నీ మనసులో ఏదైనా మార్పు వస్తే చెప్పు, నీకు మరో అవకాశం ఉంది అని యువకుడిని గమనిస్తూ అన్నాడు. యువకుడు సంతోషపడి మీరు చెప్పింది ఒకసారి ప్రయత్నిస్తాను. మార్గం ఏంటో చెప్పండి అని మర్యాద పూర్వకంగా అడిగాడు. 

వృద్ద సన్యాసి సంతోషించి సరే చెప్తాను, కానీ లక్ష్యం నెరవేరడానికి నీవు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవాలి. అందుకు సమ్మతమేనా అని అడిగాడు. నేను అనుకున్నది సాధించలేనప్పుడు ఈ జీవితం వృధా, నాకు సాధ్యమైన ఎంతటి సాహసోపేతమైన నిర్ణయం అయినా నేను సిద్దం అన్నాడు. 

యువకుని పట్టుదలకు వృద్ద సన్యాసి సంతోషించి సరే ఇక నీ ఆశయం దాదాపుగా సిద్దించినట్లే. ఇక్కడ నుండి రెండు వందల మైళ్ళ దూరంలోని వింధ్యారణ్యంలో విరూపాక్షానంద అనే సర్వసిద్దులు సాధించిన ఒక మహర్షి ఉన్నారు. నీవు మరో ప్రశ్న లేకుండా వెంటనే బయల్దేరి ఆయన వద్దకు చేరుకో. అక్కడ అంతా నీ కోరిక మేరకు జరుగుతుంది అని చెప్తూ వెళ్ళాల్సిన మార్గన్ని వివరంగా చెప్పి సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

Best telugu moral stories 2021

ఆ యువకుడు తన చిరకాల వాంఛను సాకారం చేసుకోవడానికి మిక్కిలి ఉత్సాహంతో వింధ్యారణ్యం వైపుకు బయల్దేరాడు. అది అతను ఉహించిన దానికంటే ఎంతో దుర్భేధ్యమైన అడవి. వింధ్యారణ్యంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వృద్ద సన్యాసి చెప్పినట్టు నిజంగా జరుగుతుందా అన్న ఆలోచనలో ముందుకు సాగుతున్నాడు. మహర్షిని చేరుకునే మార్గాన్ని చేరుకోవడానికి వృద్ద సన్యాసి చెప్పిన ఆనవాళ్ళు యథాతధంగా ఎదురుపడుతూ ఉన్నాయి. అలా సన్యాసి మాటల మీద అతడికి నమ్మకం కాస్త కుదుటపడింది. 

ఎట్టకేలకు ఎంతో ప్రయాసపడి విరూపాక్షానంద స్వామి వారిని చేరుకున్నాడు. ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న మహర్షి అతని రాకను గమనించి దగ్గరకు పిలిచాడు. ఆ యువకుడు మహర్షి వద్దకు వెళ్లి వినయంతో నమస్కరించాడు. మహర్షి యువకున్ని చూసి “నాయనా, చాలా దూరం నుండి ఇక్కడకు వచ్చావని తెలుస్తోంది, నిన్ను చూస్తూ ఉంటే జీవితం మీద ఎంతో నిరాశతో ఉన్నట్టు నాకు తోస్తోంది. నీ నిరాశకు కారణం ఏమిటి? ఇక్కడకు రావడంలో ఆంతర్యం ఏమిటి” అని అడిగాడు. 

ఆ యువకుడు మహర్షి దగ్గరకు వచ్చి నమస్కరిస్తూ, స్వామీ నేను పన్నెండేళ్ళుగా నిద్రాహారాలు మాని, నా సంతోషాలు అన్నింటినీ త్యాగం చేసి ఒక పెద్ద కోటీశ్వరుడిగా ఎదగడమే ధ్యేయంగా ఎన్నో ప్రయత్నాలు చేసాను, అలాగే ఇంకా చేస్తున్నాను. ఎంత శ్రమించినా నాకు అనుకున్నంత ఫలితం దక్కడం లేదు. మీ గురించి ఒక సన్యాసి చెప్తే విన్నాను. దయచేసి నా అభీష్టం నెరవేరేలా నన్ను అనుగ్రహించండి అన్నాడు. 

Best telugu moral stories 2021

యువకుడి తాపత్రయం గమనించిన విరూపాక్షానంద మహర్షి నవ్వుతూ “నాయనా, నీ కోరిక సబబే. మానవ సహజమైన కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించడం కూడా సబబే. నీ ప్రయత్నాలన్నీ నీవు చేసాను అని చెప్పావు. చివరి ప్రయత్నంగా నా వద్దకు వచ్చినట్టు గోచరిస్తోంది. నీ అభీష్టాన్ని నెరవేర్చడం నాకు సులభమే అయినప్పటికీ ఈ సృష్టిలో ప్రతీ చర్యకు ప్రతి చర్య తప్పదు. అంతా దైవాధీనం కనుక నేను నా తపస్సు శక్తితో చర్యను మాత్రమే సృష్టించగలను, ప్రతి చర్య నీవే భరించాలి అన్నాడు. 

యువకుడు కాసేపు మనసులో దీర్ఘంగా అలోచించి, డబ్బుతో ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు. అలాంటి కోట్ల సంపద నా వశం చేస్తాను అంటే ఎంతటి సాహసానికైనా నేను సిద్దం అనుకుని తనకున్న అపార ధన సంపదలపై వ్యామోహంతో అడుగు ముందుకు వేసాడు. స్వామీ, నా చిరకాల కోరికను మీరు తీరుస్తాను అంటే ఎటువంటి ప్రతి చర్యలు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధం. దయచేసి ఆ మార్గం నాకు సెలవీయండి అన్నాడు. 

విరూపాక్ష మహర్షి ఆ యువకుని ఉత్సాహాన్ని గమనించి సరే, నీకు మార్గం చెబుతాను అని దగ్గరకు పిలిచి చెవిలో మంత్రోపదేశం చేసాడు. నేటి నుండి నేను చెప్పిన ఈ మంత్రాన్ని ఏకాంత ప్రదేశంలో కళ్ళు మూసుకుని మూడుసార్లు జపించాలి. కళ్ళు తెరిచి చుస్తే నీ ముందు భౌతిక ప్రపంచంలో చలామణి అయ్యే కోటి రూపాయల నగదు ప్రత్యక్షం అవుతుంది అన్నాడు.

Best telugu moral stories 2021

యువకుడు ముఖంలో ఆనందం ఉప్పొంగింది. చాలా సంతోషం స్వామి. మరి దానికి ప్రతిచర్యంగా ఈ ప్రకృతి నా నుండి ఏమి ఆశిస్తుంది అన్నాడు ఆదుర్దాగా. మహర్షి యువకునివైపు చూసి ప్రతిచర్యగా నీ జీవిత కాలంలో నీ ఆయుస్సు ఒక సంవత్సర కాలం తగ్గుతుంది. కాబట్టి సంపదలను ఎంత వినియోగించుకుంటావో నీ ఇష్టం అని ప్రతిచర్య కోసం మహిర్షి యువకునితో చెప్పాడు. 

ఆ యువకుడు తన జీవిత లక్ష్యం నెరవేరుతోందన్న విజయోత్సాహంతో ప్రతిచర్య ఇంత సులభమా, ఎంతో క్లిష్టమైనది అనుకున్నాను స్వామి అన్నాడు. విరూపాక్షానంద స్వామి చిరునవ్వు నవ్వి సరే ఇక నీవు వెళ్లిరా. మళ్ళీ కలుద్దాం అన్నాడు. ఆ యువకుడు సంతోషంతో స్వామి వారిని నమస్కరించి తన స్వస్థలానికి బయలుదేరాడు. 

తిరిగి ప్రయాణంలో ఎంతో ఆనందంతో ఇంటికి చేరిన యువకుడు తన ఆయుస్సులో ఒక్క రోజు కూడా వృధాగా పోకూడదు అనుకున్నాడు. వెంటనే మంత్రం ఉపయోగించదలచి ఏకాంతత కోసం ఇంటి తలుపులు అన్నింటినీ మూసేసాడు. తర్వాత మహర్షి చెప్పినట్టు కళ్ళు మూసుకుని మంత్రాన్ని జపించాడు. మంత్రాన్ని జపించిన తర్వాత జీవితంలో అతి పెద్ద గెలుపుని ఆస్వాదించేందుకు ఆందోళన చెందుతూ ఉత్కంఠగా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.

మహర్షి చెప్పినట్టు నిజంగానే అతని కళ్ళ ముందు కోటి రూపాయలు ప్రత్యక్షమైంది. యువకుడు పట్టరాని ఆనందంతో ఎగిరి గంతులేసాడు. వెంటనే అప్రమత్తమై ఎవరి కంట పడకుండా ఆ డబ్బును జాగ్రత్తగా నిల్వ చేసాడు. అలా ఐదేళ్ళలో మొత్తం నలభై సార్లు మంత్రాన్ని ఉపయోగించి కోట్లు పోగేసాడు. దాదాపుగా అతను అపర కుబేరుడు కావాలన్న ఆశ నెరవేరింది. మరో రెండు కోట్లు ఉంటే అతను దేశంలోనే సంపన్నుడిగా స్థానం పొందుతాడు. 

Best telugu moral stories 2021

ఆ రోజు నిండు పౌర్ణమి. పరిపూర్ణమైన చంద్రుని కాంతి చెట్టుకొమ్మల చాటుగా ప్రసరిస్తూ విశాలమైన వరండాలో వాలు కుర్చీపై కూర్చున్న అరవై ఐదేళ్ళ వృద్ధుడి మడతలు పడిన చర్మాన్ని తాకి తన రూపాన్ని రాజసౌధం గోడలపై ప్రతిబింబిస్తోంది. ఆ వృద్ధుని మనసు ఎంతో కలతగా ఉంది. నలభై కోట్లు పోగేసిన తన ఉత్సాహం మరో రెండు కోట్ల కోసం మదన పడుతోంది. కేవలం రెండు కోట్ల కోసం మంత్రాన్ని జపించడానికి ఎందుకు ఇంత మధనపడుతున్నాను అని తనలో తాను ఆలోచించసాగాడు, దిగులుతో కుంగిపోతున్నాడు.

ఆ వృద్దుడు హఠాత్తుగా కుర్చీ నుండి లేచి ఒక్క క్షణం కూడా నిరీక్షించలేనని కటిక చీకటిలో ఒంటరిగా కారు నడుపుతూ వింధ్యారణ్యానికి బయలుదేరాడు. సరిగ్గా ఐదేళ్ళ క్రింద అతని ఆలోచనలు ప్రస్తుతం అతని ఆలోచనలు, ఒక్కసారి పోల్చి చూసుకున్నాడు. విధి ఎంత విచిత్రమైనది అని మనసులో అనుకుంటూ తెల్లవారేసరికి విరూపక్షానంద మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. 

Best telugu moral stories 2021

ఆశ్రమ ద్వారం దగ్గర ఒక ముప్ఫై ఏళ్ల యువకుడు ఆ వృద్దుని వంక తదేకంగా చూస్తున్నాడు. వృద్దుడు కూడా ఆ యువకుడ్ని చూసి అసూయపడుతూ ఆహా! ఇంతటి తేజస్సు గల యవ్వనాన్ని వృధాగా నేను కోల్పోయానా అనుకుంటూ లోపలకి వెళ్ళాడు. వృద్దుని రాకను గమనించిన మహర్షి లోపలకి రమ్మని పిలిచి అష్ట ఐశ్వర్యాలతో సంతోషమేనా నాయనా అని అడిగాడు.

 ఆ వృద్ధుడు వెంటనే మహర్షి కాలి మీద పడి “స్వామీ, జీవితంలో డబ్బు సంపాదనకు మించిన ఆశయం మరొకటి లేదు అని తలచాను. డబ్బుతో ప్రపంచంలో దేనినైనా జయించవచ్చు అనుకున్నాను. కానీ జీవితంలో ఒక్క రోజు సమయం కోల్పోయినా మళ్ళీ తిరిగి రాదు అనే సత్యాన్ని గ్రహించలేకపోయాను. ఈ సంపదలు గడిచిన నా కాలాన్ని ఒక్క క్షణం కూడా తిరిగి ఇవ్వలేవు. అటువంటి సంపదలు నాకు ఇకపై వద్దు. దయచేసి ఈ సంపదలు గ్రహించి నా యవ్వనాన్ని నాకు తిరిగి ఇవ్వండి” అని వేడుకున్నాడు. 

Best telugu moral stories 2021

మహర్షి అతన్ని పైకి లేపి “చూడు నాయనా, ఈరోజు నీవు ఇక్కడకి వస్తావని నాకు ముందే తెలుసు. ఆ ద్వారం దగ్గర నిలుచున్న యువకుడు కూడా నీకోసమే వేచియున్నాడని అన్నాడు. ఆ వృద్దుడు “అతడు నాకోసం వేచియున్నడా, అతను ఎవరు, నాకోసం ఎందుకు వేచియున్నాడు స్వామీ” అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒక్క నిముషం, అతను ఎవరో చెప్తాను అని ఆ యువకుని వైపు చూసి లోపలకి రమ్మని సైగ చేసాడు విరూపాక్షానంద మహర్షి. 

ఆ యువకుడు లోపలకి వచ్చి మహర్షిని నమస్కరిస్తూ వృద్దునికి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. మహర్షి కళ్ళు మూసుకుని తన కమండలంలోని నీటిని మంత్రించి ఆ ఇద్దరి వ్యక్తులపై చల్లాడు. అంతలో ఆ వృద్దుడు అతను కోల్పోయిన యవ్వనాన్ని తిరిగిపొందాడు. అతడు తిరిగి వచ్చిన తన యవ్వనాన్ని చూసుకుని ఆనందంతో మురిసిపోతున్నాడు. 

అంతలో తనకి ఎదురుగా ఉన్న ముప్ఫై ఏళ్ల యువకుని గురించి తెలుసుకోవాలన్న ఆశక్తితో అతని వైపు చూసాడు. చూస్తుండగానే ఆ ముప్ఫై ఏళ్ల యువకుని చర్మం మడతలు పడుతూ, నడుం వంగి జుట్టు తెల్లగా మార్పు చెందుతూ డబ్భై ఏళ్ల వృద్దునిగా మారిపోయాడు.

వారి వయస్సులు తారుమారు అయ్యాయని గ్రహించిన యువకుడు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఐదేళ్ళ కిందట తన కోరిక నెరవేరడానికి మహర్షిని దర్శించమని చెప్పిన పండు ముసలి సన్యాసి. వెంటనే ఆ యువకుడు ఆశ్చర్యంతో “స్వామీ! ఈయనే నన్ను మీ దర్శనం కోసం పంపించారు. అసలు ఈయన ఎవరు? ఈయనకు నాకు సంబంధం ఏమిటి అని మహర్షిని అడిగాడు. 

Best telugu moral stories 2021

మహర్షి మాట్లాడుతూ “నాయనా! ఇతను నీవు కోరుకున్న దానికంటే అపర కుబేరుడు. జీవిత చరమాంకంలో సత్యం గ్రహించి తను జీవితాంతం సంపాదించిన సొమ్మును దాన ధర్మాలు చేసి నా వద్దకు వచ్చాడు. సంపాదనే ధ్యేయంగా కోల్పోయిన తేజోమయమైన ఒక ఏడాది యవ్వన కాలాన్ని తిరిగి తనకి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. అందువలన సరిగ్గా అతని ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్న నీ వద్దకు అతన్ని పంపాను. నా తపో శక్తితో నీ యవ్వనం అతనికి, అతని వృధ్యాప్యం నీకు సంక్రమించేలా చేసాను. తర్వాత నీకు సంపదలపై ఉన్న వ్యామోహంతో అతను కోరుకున్న ఏడాది యవ్వన కాలానికి బదులుగా ఐదేళ్ళ యవ్వన కాలాన్ని నీకు నువ్వే సమర్పించుకున్నావు.

“ఇప్పటికైనా గ్రహించండి. మీ విలువైన సమయం కోట్లు వెచ్చించినా ఒక్క క్షణం కూడా తిరిగి పొందలేరు. మనిషి బ్రతకడానికి మాత్రమే సంపాదన కావాలి. సంపాదన కోసం బ్రతికే జీవితం ఆద్యంతం వృధా అవుతుంది”

అని చెప్పి మహర్షి వాళ్ళని ఆశీర్వదించి వారి వారి ఇళ్ళకు పంపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!