అడవి
Short inspirational stories about life
భగవంతుడు తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరు భక్తులకు మరొక జన్మను ప్రసాదించాలని అనుకున్నాడు. ఆ ఇద్దరు భక్తులను శిశువులుగా మార్చి ఆ ఇద్దరూ తనకు ఎంతో ప్రియమైన వారు కనుక వాళ్ళకి భూమి మీద ఎటువంటి ఆవాసం కావాలో కోరుకొమ్మని అడిగాడు. వారిలో ఒకడైన వెంగప్ప తనని ఒక గొప్ప ధన వంతుని ఇంట్లోకి పంపించమని వేడుకున్నాడు. భగవంతుడు తథాస్తు అని పలికి మరో భక్తుడు కన్నప్ప వైపు చూసాడు. కన్నప్ప దైవం ఎలా తలస్తే అలా చేయమని భగవంతుడిని కోరాడు. భగవంతుడు బాగా ఆలోచించి మీ ఇద్దరి జీవనం ఒకే విధంగా ఉంటుందని వరం ఇచ్చి పంపించాడు.
వారిని ఆకసం నుండి భూమి మీదకు జారవిడిచే సమయంలో కన్నప్ప ఒక దట్టమైన అటవీప్రాంతంలో ఒక ఆదిమ తెగ కుటుంబానికి దొరికాడు. వెంగప్ప తను కోరుకున్న విధంగా ఒక మహా నగరంలోని ఒక గొప్ప ధనిక వ్యక్తికి దొరికాడు. రెండు కుటుంబాల దంపతులు పిల్లలు లేక అలమటిస్తున్న కారణంగా వారు ఆ శిశువులను భగవంతుని ప్రసాదంగా భావించారు. వారిని తమ సంతానంగా స్వీకరించి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.
Inspirational stories about life
స్వర్గంలో ఈ వార్తను విన్న దేవతల రాయభారి ఇద్దరి శిశువుల పరిస్థితి ఎలా ఉందో చూసి వద్దామని భూమికి బయల్దేరాడు. ముందుగా ఆకాశాన్నంటే భవంతులు కలిగిన ఆ మహా నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ అత్యంత ధనవంతుడైన వ్యాపారి ఇంట్లో సకల సౌకర్యాల మధ్య పెరుగుతున్న శిశువుని చూసాడు.

ఆహా! భగవంతుడు ఎంత గొప్పవాడు. తన భక్తుడు కోరిన వరాన్ని వెంటనే ప్రసాదించి అతని దయగల హృదయాన్ని మరోమారు నిరూపించుకున్నాడు. ఈ సందర్భంతో భగవంతుడి కరుణా హృదయాన్నిఈ ప్రపంచమంతా మరోమారు గ్రహిస్తుంది అనుకున్నాడు.
తర్వాత భగవంతుడి రెండవ భక్తుడైన కన్నప్ప ఎలా ఉన్నాడో చూసి వద్దామని అతడు అక్కడి నుండి బయల్దేరాడు. వెంటనే భూగోళం మీద కన్నప్ప ఉండే దిశని చూపించమని ఆకాశవాణిని అజ్ఞాపించాడు. ఆకాశవాణి స్పందించి కన్నప్ప ఉండే మార్గాన్ని అతడికి నిర్దేశించింది.
రాయభారి ఆ దిశగా ప్రయాణించి దుర్భేధ్యమైన అటవీ ప్రాంతలో సంచరిస్తూ ముందుకు సాగుతున్నాడు. అకస్మాత్తుగా పర్వతం అంచున ఉన్న ఒక ఆదిమ తండా దిశగా కన్నప్ప నివాసాన్ని చూపిస్తూ ఆకాశవాణి స్పందించింది.
అతడు అటువైపుగా వాయు వేగంతో ప్రయాణించి అక్కడ ఉన్న ఆటవికుల నివాసాలను చూసి ఆశ్చర్యపోయాడు. “ఔరా! ఏమి ఈ విచిత్రం. భగవంతుడు ఈ భక్తుడకు ఏమని వరం ఇచ్చాడు? కానీ ఇక్కడ ఏమి జరుగుతోంది. ఇద్దరూ సమానమైన జీవనాన్ని ఆచరిస్తారు అనే కదా అయన చివరిగా వరం ఇచ్చాడు. వెంగప్పకు సర్వ సౌఖ్యాలు, సర్వ భోగాల సాకారమా? కానీ నోరువిడిచి అడగనందుకే కన్నప్పకు ఇంత దుస్థితి కలిగిందా. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు, భగవంతుడు కూడా తల్లిదండ్రుల సమానుడే కదా? అందుకే కాబోలు అడగని వారిని ఇలా పెడచెవిన వదిలేసాడు” అనుకుంటూ బాధపడ్డాడు.
కాసేపు అక్కడే కుర్చుని ఆలోచించాడు. భగవంతుడు కారణం లేకుండా ఏదీ చెయ్యడు. బహుశా ఈ పసివాడికి రాజయోగం జాతకరీత్యా ఇంకా కలగలేదు కాబోలు అని తన మనస్సుని ఓదార్చుకుని తిరిగి స్వర్గానికి బయల్దేరాడు.
కొన్నాళ్ళు గడిచింది. శిశువులు ఇద్దరూ యవ్వన ప్రాయనికి చేరుకున్నారు. కన్నప్ప అడవికి రారాజులా ఎదిగాడు. దాహం వేస్తే సెలయేరులు అతడికి దాహం తీరుస్తున్నాయి. ఎండకాస్తే పచ్చని చెట్లు అతనికి సేద తీరుస్తున్నాయి.

మరోవైపు వెంగప్ప ఆధునికమైన విలాసాలతో, హంగు ఆర్భాటాలతో ఒక్కరోజు అతడిలా జీవించినా చాలు అనుకునే రీతిలో సాగిపోతూ ఉంది. అతడి ప్రయాణానికి రోజుకో కారు, వేసుకోవడానికి డజన్ల కొద్ది బట్టలు, అతడు కోరుకున్నవి అన్నీ క్షణాల్లో అతడి ముందు ఉండేవి.
దేవతల రాయభారికి సరిగ్గా అలంటి సమయంలో ఆ ఇద్దరి భక్తుల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నదో చూడాలనిపించింది. వెంటనే అతడు భూమికి చేరుకున్నాడు. ముందుగా వెంగప్పని చూడటానికి బయల్దేరాడు.
స్వర్గలోకాన్ని తలదన్నే సౌఖ్యాల నడుమ యువకుడైన వెంగప్పని చూసి, భగవంతుడిని తిరిగి ప్రశంసించడం ప్రారంభించాడు. ఇతడి పరిస్థితే ఇంత వైభోగంగా ఉంటే బాల్యంలో కటిక పేదరికంలో నెట్టివేయబడ్డ కన్నప్పకు ఇంతకు మించిన సౌఖ్యాలు ఆ దయగల భగవంతుడు ప్రసాదించే ఉంటాడు. తక్షణమే అతడిని చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది అని అనుకుంటూ రాయభారి వెంటనే కన్నప్పను చూడటానికి ప్రయాణమయ్యాడు.
An inspirational story
ఒక పెద్ద బండరాయి, అక్కడి నుండి క్రిందకు చుస్తే కళ్ళు తిరిగే లోయ. అక్కడ ఒక యువకుడు క్రిందికి దూకేయడానికి సిద్దంగా ఉన్నాడు. అతడి స్నేహుతులైన అక్కి, మక్కి అనే రెండు వానరాలు అతడిని వారిస్తూ ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. అతడు వాటి నుండి తప్పించుకుని ధైర్యంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ గట్టిగా అరుస్తూ క్రిందికి దూకేసాడు.

అప్పుడే అక్కడకు వచ్చి ఇదంతా గమనిస్తున్న దేవతల రాయభారి కన్నప్పా వద్దూ అంటూ అరుస్తూ పరుగు పరుగున బండరాయి వద్దకు వెళ్ళాడు. అప్పటికే అతడు క్రిందికి దూకేయడంతో అయ్యో! ఒక్క క్షణం ముందుగా వచ్చినా నీ గతం గురించి నీకు తెలియజేసి ఈ ఘోరం జరగకుండా ఆపగలిగే వాడినే అని రోదిస్తూ ఉన్నాడు.
అంతలో అక్కి-మక్కి బండమీద నుండి క్రిందికి చూస్తూ సంతోషంతో గంతులు వేస్తున్నాయి. రాయభారి అసలు ఏమి జరిగిందో అర్ధం కాక నెమ్మదిగా బండరాయి చివర వద్దకు వెళ్లి క్రిందికి చూసి హమ్మయ్య అని గట్టిగా ఊపిరితీసుకున్నాడు.
అఘాతం వంటి ఆ లోయలో ఒక పెద్ద నీటి మడుగు ఉంది. కన్నప్ప చక్కర్లు కొడుతూ ఆ నీటిలో సంతోషంతో ఈదుతున్నాడు. రాయభారి తిరిగి ఆలోచనలో పడ్డాడు. కన్నప్ప వేషధారణ, ఇక్కడి పరిస్థితి చూస్తుంటే అతడికి ఇంకా రాజయోగం పట్టినట్లుగా లేదు. మనిషి ఆనందించడానికి అనుభవించడానికి యవ్వనమే పట్టుకొమ్ము. కానీ భగవంతుడికి ఇతని మీద ఎందుకు ఇంత పక్షపాతం. ఇతడి మీద దయా దాక్షన్యం ఎందుకు కలగడం లేదు అనే ప్రశ్నలు అతడి మదిని తొలిచేస్తూ ఉన్నాయి.
అంతలో ఈత ముగించి కన్నప్ప చెట్టు వ్రేళ్ళ సహాయంతో కష్టపడి పైకి వచ్చాడు. అక్కి-మక్కీల వైపు చూసి “లోయ చాలా లోతుగా ఉంది కదా. పైకి ఎక్కేసరికి ఉన్న శక్తి మొత్తం కరిగిపోయింది. నాకు బాగా ఆకలేస్తుంది స్నేహితులారా!” అని అన్నాడు. అంతే, వెంటనే వానరాలు ఒక్క క్షణం ఆగకుండా అడవిలోకి పరుగులు తీసాయి.
అక్కడికి కొన్ని నిముషాల వ్యవధిలోనే అక్కి-మక్కి అడివినంతా గాలించి వివిధరకాల ఆకులూ అలమలూ, దుంపలు, సెనగలు వంటి ఆహార పదార్ధాలను తీసుకువచ్చి అతడి కాళ్ళ వద్ద రాతి నేలమీద పడేసాయి.
ఆకలితో ఉన్న కన్నప్ప తన స్నేహితులకి ధన్యవాదాలు తెలియజేసి వారితో కలిసి బండపై కుర్చుని వాటిని తినడం ప్రారంభించాడు. రాయభారి మదిలో ఒకవైపు వందరకాల రుచికరమైన ఆహార పదార్ధాల నడుమ వందమంది సేవకుల పరిచారంతో వెంగప్ప వైభోగం అతడి కళ్ళ ముందు కదలాడింది. మరో వైపు కన్నప్ప యొక్క ఈ దీనమైన స్థితిని చూసి ఓర్వలేక బాధతో స్వర్గానికి ప్రయాణమయ్యాడు.
Inspirational stories about god
రాయభారి మనసు చాలా కలతగా ఉంది. భగవంతుడు ఇచ్చినమాటను నిలబెట్టుకోకుంటే ఈ సృష్టి ఇకపై దేని మీద విశ్వాసంతో మనుగడ సాధిస్తుంది అని ఆలోచిస్తున్నాడు. మనిషికి సర్వోత్క్రుష్టమైన జ్ఞానం యొక్క పరిపక్వత వృధ్యాప్యంలో కలుగుతుంది. కనుక భగవంతుడు సర్వ వైభవాల యోగాన్ని దానిని సద్వినియోగం చేసుకోగల జ్ఞాన శక్తి కలిగిన నాడు ప్రసాదిస్తాడు కాబోలు అనుకుంటూ తన అంతర్గతాన్ని సమాధానపరచుకున్నాడు.
కొన్ని ఏళ్ళు గడిచాయి. కన్నప్పలో మునుపటి కంటే దురుసుతనం మరియు వేగం పూర్తిగా తగ్గింది. శరీరంలో శక్తి క్షీనిస్తోంది. వృధ్యాప్య ఛాయలు అతడిని పూర్తిగా అలముకున్నాయి. మరోవైపు వెంగప్ప కూడా క్రమంగా శక్తిహీనుడు అవుతున్నాడు. పూర్వజన్మ వాసనల వలన అతనిలో భోగ విలాసాల మీద వ్యామోహం సడలింది. అతడు అన్నింటినీ త్యజించి ఎంతో సాధారణమైన జీవనాన్ని అలవాటు చేసుకున్నాడు.

సరిగ్గా అటువంటి సమయంలో దేవతల రాయభారి కన్నప్పను చూసి వద్దామని నేరుగా అతడి వద్దకు బయల్దేరాడు. అక్కడకు వెళ్లేసరికి కన్నప్ప పరిస్థితి మరింత దీనంగా కనిపించసాగింది.
Short story about inspiration
అయ్యో! ఇతడికి వృద్దాప్యంలో కూడా భగవంతుడు భోగ భాగ్యాలను ప్రసాదించలేదే. ఈ సమయంలో ఇవే అతడి జీవితంలో చివరి క్షణాలు. ఇతడు వెంగప్పతో సరిసమానమైన భోగ భాగ్యాలను అనుభవించే సమయం ఇంకెప్పుడు వస్తుంది. భగవంతుడు ఇతడి పట్ల ఇంతటి పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు అతడు భావోద్వేగాలకు అతీతుడు ఎలా అవుతాడు. భగవంతుడు తన మాటను నిలబెట్టుకోలేని తరుణంలో ఇకపై ఈ సృష్టిలో ధర్మం ఏ విధంగా తన మనుగడ సాగించగలదు అంటూ ఆక్రోష ఆవేదనలతో భగవంతుడిని ప్రశ్నించడానికి దేవతల రాయబారి వేగంగా స్వర్గానికి ఆవల ఉన్న సత్య లోకానికి బయల్దేరాడు.
సృష్టికర్త శ్వేత పంకజ ఆకృతిలో విస్తరించిన అనంత విశ్వం మీద కూర్చుని దీర్గంగా ఆలోచిస్తూ ఒక్కో ప్రపంచాన్ని ఎంతో అవలీలగా మలుస్తూ ఉన్నాడు. అంతటి మహోత్తరమైన సన్నివేశాన్ని కళ్ళారా చూసిన దేవతల రాయభారికి తనలోని ఆవేశం ఒక్కసారిగా పటాపంచలైంది. ఆ అద్భుతమైన దివ్య మంగళ స్వరూపాన్ని దర్శిస్తూ ఆహా ఎంతటి వైభోగం, ఇంతకంటే మరొక వైభోగం ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా దొరుకుతుందా అని అనుకుని సాష్టాంగ నమస్కారం చేసాడు.
- ఈ కథలను కూడా చదవండి
- మరచిపో నేస్తమా – Heart touching story with moral
- ధర్మ సంకటం – An unconditional love of a father
- వక్రీకరణ | Best inspiring stories in telugu 2021
- సాలిగ్రామ యోధుని కథ – A warrior of self confidence
సృష్టికర్త అయిన భగవంతుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి కుమారా, నీవు ఇక్కడకి వీచ్చేసి సుమారు రెండు యుగాల సమయం గడిచింది. ఉన్న ఫలంగా ఇక్కడకు వచ్చిన కారణం ఏమి అని సర్వం తెలిసిన సర్వేశ్వరుడు ఏమి తెలియనట్టు అమాయకంగా అడిగాడు.
తండ్రీ, మీరు గతంలో మీ ప్రియ భక్తుల కోరిక మేరకు వారికీ మనవ జన్మని ప్రసాదించారు.. అయితే వెంగప్పని మీరు వరం కోరుకుమ్మని అడిగినప్పుడు అతడు భోగభాగ్యాలకు ఆవాలమైన ఒక ధనవంతుని ఆవాసాన్ని ఎంచుకున్నాడు. కానీ దైవ నిర్ణయమే తన నిర్ణయంగా భావించిన కన్నప్పని కటిక పేదరికంలో మనవ సమాజాలకి అత్యంత దూరంగా ఉన్న ఒక buy alpha pharma steroids-usa.net దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో పడవేసారు.
ఇది భగవంతుడిని కోరికలతో దర్శించుకోవడం మాత్రమే ఉన్నతమైన మార్గంగా, భగవంతుడే సర్వస్వంగా స్వీకరించే వారికి ఏ ఉపయోగం లేనట్టుగా మార్గ నిర్దేశం చేస్తోంది. అంటే భగవంతుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుడు తాను నిలువెల్లా కోరికలతో , ఆశావ్యామోహాలతో మీ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే అతడికి ఫలితం ఉంటుందా? మరి వాళ్ళ ఇద్దరి జీవనం ఒకే విధంగా ఉంటుంది అనడంలో ఆంతర్యం ఏమిటి? గత కొన్ని ఏళ్లుగా నా మనస్సులో ఈ ప్రశ్నలు నన్ను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. దయచేసి నా సందేహాలను నివృత్తి చేయండి అన్నాడు.
Inspirational stories of mercy of god
“కుమారా! వాళ్ళ ఇద్దరి జీవనం ఒకేలా ఉంది అందులో ఏ మార్పూ లేదు. వెంగప్ప పూల పాన్పు మీద నిద్రిస్తే కన్నప్ప గడ్డి మోపుల మీద నిద్రించాడు. వారి ఇరువురి నిద్రలో ఎటువంటి బేధము లేదు. వెంగప్ప బంగారు కంచంలో భుజిస్తే కన్నప్ప విస్తరి ఆకులలో భుజించాడు. అయినప్పటికీ వారిద్దరి ఆకలిలో ఎటువంటి బేధము లేదు.
వెంగప్ప తాను తాత్కాలికమైన భోగవిలాసాలకు సంబంధించిన చాలా చిన్న కోరిక కోరుకున్నాడు. అది తీర్చడం నాకు ఎంతో సులభమైనది కూడా. కానీ కన్నప్ప దైవం ఎలా తలిస్తే అలా చేయమని ఒక భారవంతమైన కోరిక కోరాడు. సృష్టికర్తను అయిన నాకే అది ఒక సవాలు ఉంటే నీవు ఒప్పుకోగలవా? ఎందుకంటే అతడికి ఒక ఆవాసాన్ని వెతికి పెట్టాల్సిన బాధ్యత స్వయంగా నాపై పడింది.
Inspirational short stories about nature
నాకంటూ ఏ ఆవాసమూ లేదు. ఈ ప్రకృతియే నా ఆవాసము. కాబట్టి నా ఆవసమే అతడి నివాసము అయినది. నేనే అతడి తల్లిగా, తండ్రిగా ఆ ప్రకృతిలో ఉద్భవించాను. నా ప్రమదగణాలు అతడి స్నేహితులయ్యారు. ఇదివరకే అతడి తల్లిదండ్రులుగా కర్తవ్యం పూర్తిచేసుకున్న నా అంశలు నాలో లీనమయ్యాయి. ఇప్పుడు నేనే స్వయంగా వెళ్లి కన్నప్పని సాదరంగా నాలో ఐక్యం చేసుకోవాలి. ఇదంతా నిజంగా కష్టతరమైన ప్రక్రియే కదా కుమారా” అని భగవంతుడు ఆ రాయభారిని చూసి చిరునవ్వు నవ్వాడు.

తండ్రీ! నీ సమాధానంతో నాలోని అజ్ఞానపు నీడలు పూర్తిగా తొలగిపోయాయి. భూమిపై ప్రజలు క్షణికమైన ఆనందాల కోసం శాశ్వతమైన బ్రహ్మానందాన్ని చేజార్చుకుంటునారని నాకు అర్ధం అయింది. మీరు వారిద్దరికీ సమానమైన జీవనాన్ని ప్రసాదించినప్పటికీ కన్నప్ప తన జీవితాన్ని పూర్తిగా సార్ధకం చేసుకున్నాడు. అతడికి కలిగిన అదృష్టం ఈ విశ్వంలో వెలకట్టలేనిది అంటూ భక్తి పారవశ్యంలో ఆ రాయభారి భగవంతుడికి సంస్కరించి మళ్ళీ భూమికి బయల్దేరాడు.
వృద్దాప్యంలో ఉన్న వెంగప్పను చూసిన రాయభారి అతడి సర్వసాధారణమైన జీవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే మారువేషంలో వెళ్లి, “సర్వ సుఖ భోగాలకు నిలయమైన నీ ప్రస్థానం ఇలా బీడుబారి పోయిందే, దానికి కారణం ఏమిటి?” అని వెంగప్పను ప్రశ్నించాడు.
Inspirational story with moral lesson
“తాత్కాలికమైన సంతోషాలు ఎదో ఒకరోజున మీకు విరక్తిని కలిగిస్తాయి. దానినే వైరాగ్యం అంటారు. ఈ ప్రక్రియకు చేరుకోవడానికి ఎంత మూల్యం చెల్లించాలో నేను అంతమొత్తం చెల్లించాను. అందుకే నా ప్రస్థానం ఇలా బీడుబారి పోయింది” అని అతడు సమయస్పూర్తితో సమాధానం చెప్పాడు.
I really like this story …..
God never show parchiyatily…
Because he is a god ….
He see Avery one equal….
Great
Thank you