పట్టుదల

best Success Stories in Telugu 2021

“జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. లక్ష్యం లేని జీవితం తెరచాప లేని నావ వంటిది. ఎందుకంటే తెరచాప ఎదురు గాలిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని నావను ముందుకు నడిపిస్తుంది. లక్ష్యం లేని జీవితం ఎటుపోతుందో ఎవరికీ తెలియదు” అని తెలుగు మాస్టారు చెప్పిన మాటలను ఫణిదర్ ప్రతీక్షణం అతని మనస్సులో మనన చేసుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్ళకు చదువు పూర్తి అయ్యాక కూడా ఆ మాటలను మర్చిపోకుండా ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 

Success Stories in Telugu 2021

ఫణిదర్ ఒక లక్ష్యాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. రెండు నెలల కాలం గడిచిపోయింది. ఎటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలో అతనికి అర్ధం కాలేదు. చాలా మందిని అడిగి చూసాడు. కొన్ని లక్ష్యాలను అతని నోట్‌బుక్ లో రాసుకున్నాడు. వాటిలో దాదాపుగా చాలా లక్ష్యాలు అతని సామర్ధ్యానికి అసాధ్యం అనిపించాయి. 

అతడు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం కంటే తనకు సాధ్యమయ్యే లక్ష్యాన్ని ఎంచుకోవడం మరింత కష్టం అని అనుకున్నాడు. ముందుగా లక్ష్యాన్ని ఎంచుకోవాలంటే అతని సామర్ధ్యాలు, బలాబలాలు అతనికి తెలియాలి అని అతను తెలుగుసంహిత.కాం వెబ్సైట్ లో చదివినట్టు గుర్తుకు వచ్చింది. వెంటనే ఒక నోట్‌బుక్ తీసుకుని అతని సామర్ధ్యాలను ఫణిదర్ ఒక్కొక్కటిగా రాసుకున్నాడు. 

ఫణిదర్ తనకున్న అసాధారణమైన సామర్ధ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. వాటి అన్నింటినీ ఒక దగ్గర చేర్చకపోయి ఉంటే తనకి అన్ని సామర్ధ్యాలు ఉన్నాయని అతడికి కూడా తెలిసేది కాదు. నోట్‌బుక్ లో రాసుకున్న సామర్ధ్యాలను ఒకసారి లెక్కించాడు. అవి దాదాపు యాభైకి పైగా ఉన్నాయి. అతనికి అతను ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా అప్పుడే అర్ధం అయింది.

ఫణిదర్ కు అంతలోనే మరొక సందేహం వచ్చింది. జాబితాలో ఉన్న సామర్ధ్యాల సముదాయం నుండి తన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడానికి దేనిని ముందుగా ఎంచుకోవాలి అని. అందువలన ఈసారి జాబితాలోని సామర్ధ్యాలకు ర్యాంకులు ఇవ్వడం ప్రారంభించాడు. బలమైన సామర్ధ్యాలను ముందు వరుసలో రాస్తూ జాబితాను క్రమం చేసాడు. 

ఈసారి ఫణిదర్ కు సాధించాలనుకున్న లక్ష్యం యొక్క సామర్ధ్యాల ఎంపిక కాస్త సులభతరంగా అనిపించింది. వెంటనే అతడు మొదటి ర్యాంకులో ఉన్న సామర్ధ్యాన్ని తన లక్ష్య ఎంపికకు మరో ఆలోచన లేకుండా చేర్చుకున్నాడు. 

తదుపరి క్రమానికి వచ్చిన ఫణిధర్ తర్వాత తనకున్న సామర్ధ్యానికి తగిన రంగం కోసం ఆలోచించసాగాడు. ఈసారి అతనికి ఇంకో సందిగ్ధత ఎదురైంది. తన సామర్ధ్యానికి తగినట్టు పదుల సంఖ్యలో వివిధ రంగాలు అతనికి కనిపించాయి. ముందు దానిని కూడా ఒక జాబితాగా తయారు చేసుకున్నాడు.

Success Stories in Telugu 2021

ఫణిదర్ ఆలోచిస్తూ ఉండగా “ఇష్టం అయిన పని చేయడంలో కష్టం ఉండదు” buy winstrol injectable – bodybuilding-seriously.net అనే సూక్తిని గుర్తు చేసుకున్నాడు. ఎదురుగా ఉన్న రంగాలలో తనకి బాగా ఇష్టమైన దానిని ఎంచుకోవాలి అనుకున్నాడు. అటువంటి ఒక రంగాన్ని సుదీర్ఘంగా మనసులో చర్చించుకుని ఎంచుకున్నాడు. ఆ రంగంలో విజయం సాధించడమే తన లక్ష్యం అని చివరిగా ఒక నిర్ణయానికి వచ్చాడు. 

రెండు నెలల లోతైన అన్వేషణ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఫణిధర్ ఎంతో సంతోషంగా నిద్రలేచాడు. తెలుగు మాస్టర్ చెప్పినట్టు ఆరోజు నుండి అతనికి ఒక లక్ష్యం ఉంది. ఆ ఆలోచన అతనిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వెంటనే క్షణం తీరిక లేకుండా లక్ష్య సాధనకు అతడు ప్రయత్నాలను ప్రారంభించాడు 

దాదాపు ఏడాది కాలం అదే రంగంలో విజయం సాధించేందుకు తీవ్రమైన కృషి చేసాడు. కానీ ఆ రంగంలో ఏడాదిలో నాలుగు సార్లు అతను విఫలం అయ్యాడు. రాను రాను అతని సమయం ఆ రంగంలో వృధాగా పోతోందన్న విషయం అతనికి అర్ధం అయింది. 

ఫణిదర్ లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో ఎక్కడో లోపం ఉందని ఇదివరకే పొందుపర్చుకున్న జాబితాలను తిరిగి తెరిచాడు. సామర్ధ్యాల ఎంపికకు సంబంధించిన జాబితాను మొదటిగా క్షుణ్ణంగా పరిశీలించాడు. అందులో అతనికి ఏ లోపం కనిపించలేదు. తర్వాత అతని సామర్ధ్యానికి సరిపడే వివిధ రంగాలకి సంబంధించిన జాబితాను తెరిచి చూసాడు.

Best Success Stories in Telugu

ఫణిదర్ కు మొదటి స్థానంలో ఉన్న సామర్ధ్య రంగం మీద కలిగిన అనుభవంతో అందులో తన సామర్ధ్యం బలహీనంగా ఉందని ఒక అంచనాకి వచ్చాడు. అందువలన రెండవ స్థానంలో ఉన్న రంగాన్ని తన లక్ష్యంగా మార్చుకోవాలని నిర్ణయించాడు. వెంటనే అతనిలో నూతన ఉత్సాహం ఉరకలు వేసింది. ఎలాగైనా ఆ రంగంలో పోగొట్టుకున్న సంవత్సర కాలానికి ప్రతిఫలం సాధించాలి అని దీక్ష పూనాడు. 

ఆరు నెలల సమయం గడిచింది. గడిచిన అర్ధ సంవత్సర కాలంలో నాలుగు సార్లు విఫలమయ్యాడు. మరింత సమయం ఆ రంగంలో కృషి చేసి మరో ఏడాది కాలాన్ని వృధా చేసేందుకు అతని మనసు ఇకపై సముఖంగా లేదు. తన లక్ష్యం కోసం తను వేసుకున్న పునాదిలోనే లోపం ఉందని ఫణిదర్ మళ్ళీ జాబితాలను తిరగేసాడు. 

Success Stories in Telugu 2021

అతను ఈసారి గడిచిన రెండు రంగాలలో విజయం సాధించలేకపోవడానికి కారణాలను బాగా పరిశీలించాడు. ఆ రెండు రంగాలలో పోటీ ఎక్కువగా ఉండటం వలన అతను సఫలీకృతుడు కాలేకపోయాడని అనుకున్నాడు. ఈసారి సామర్ధ్యం అనే అంశానికి ద్వితీయ ప్రాముఖ్యత కల్పిస్తూ పోటీ తక్కువ ఉన్న రంగాన్ని మొదటి స్థానంలో చేర్చి మూడవసారి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 

ఫణిదర్ కు గతంలో ఉన్నంత ఉత్సాహం ప్రస్తుతం లేదు. కానీ లక్ష్యం లేని మనిషి తెరచాప లేని నావ వంటివాడు అనే మాటలు ఇంకా అతని హృదయంలో కంపిస్తూనే ఉన్నాయి. మరో వైపు చిన్నప్పుడు విన్న బట్టి విక్రమార్కుని కథ అతనికి గుర్తొచ్చింది. 

ఆ కథలో విక్రమార్కుడు ఎన్నో పర్యాయాలు విఫలమైన ప్రతీసారి పట్టు వదలకుండా ప్రయత్నిస్తాడు. చివరకు సహనాన్ని వీడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ద్వారా బేతాళుడిని అతని వశం చేసుకుంటాడు. కాబట్టి విజయం సాధించేవరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఫణిధర్ నిశ్చయించుకున్నాడు. 

ఫణిదర్ మూడవసారి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మూడు నెలల కాలం తీవ్రంగా శ్రమించాడు. ఈసారి అతని పరాభవం గతంలో కంటే రెట్టింపు అయింది. అయినప్పటికీ విక్రమార్కుడి కథను గుర్తు తెచ్చుకుని మరో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. పట్టుదలతో ఉంటే ఎదో ఒకరోజు విజయం అతనిని తప్పకుండా వరిస్తుందన్న ఆత్మ విశ్వాసంతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

మూడేళ్ళ కాలం క్షణాల్లో గడిచిపోయింది. ఫణిదర్ జాబితా వైపు నిరాశగా చూస్తున్నాడు. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కలిగిన అతని లాంటి వ్యక్తి ఎందులోనూ విజయం సాధించలేకపోవడం అతడి మనస్సుని తీవ్రంగా కలచి వేసింది.

చివరికి తన టాలెంట్ గురించి మర్చిపోతేనే తనకి కనీసం మానసిక ప్రశాంతత అయినా లభిస్తుందని, తన నైపుణ్యాలతో సంబంధం లేని ఎదో ఒక ఉద్యోగంలో చేరి సాధారణ జీవితాన్ని గడిపేద్దామని అనుకున్నాడు. దిగులు పడుతూ ఉపాధ్యాయులు చెప్పిన కథలు, ప్రేరణ సూక్తులు, సామెతలు, మంచి మాటలు అన్నీ ఆచరణ సాధ్యం కానివని నిత్యజీవితంలో వాటిని ఆపాదిస్తే అపజయాలు, అవమానాలు తప్ప మిగిలేది ఏమీ లేదని తనలో తాను వాపోయాడు. 

అలా ఆలోచిస్తూ ఉండగా అతడు చిన్నతనంలో విన్న మరొక కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో ఒక చీమ తనకంటే మూడు రెట్లు ఎక్కువ బరువున్న ఒక బియ్యపు గింజను ఒక గట్టు దాటి తీసుకెళ్ళాలి అనుకుంటుంది. కానీ అందుకు ఆ చీమ తన సామర్ధ్యానికి మించి బరువున్న బియ్యపు గింజను పైకి ఎక్కించలేక ఎన్నో వందల సార్లు విఫలమౌతుంది. 

కొంత సమయం తర్వాత అలసి సొలసి నీరసించి లేవలేని స్థితిలో స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. తర్వాత స్పృహ రాగానే అది తనకు జరిగిన పరాభవాన్ని గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా తిరిగి మొదటి నుండి ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. ఆ చీమకు ఆ బియ్యపు గింజను మోసే సామర్ధ్యం ఉందో లేదో నిజానికి దానికి తెలియదు. కేవలం అది దాని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 

Success Stories in Telugu 2021

మరో ప్రయత్నంగా ఆ చీమ బియ్యపు గింజను పట్టుకుని గట్టు దాటించేందుకు చుట్టు ప్రక్కల ఏదైనా సులువైన మరో మార్గం ఉందేమో అని వెతుకుతుంది. కానీ సులువైన మార్గాలు కనిపించకపోవడంతో మళ్ళీ తన ప్రయత్నాలను యథావిధిగా కొనసాగిస్తుంది. 

ఆ రోజంతా ఆ చీమ ప్రయత్నిస్తూ పడిపోతూ, స్పృహ కోల్పోతూ మళ్ళీ స్పృహలోకి వస్తూ, రాత్రి పగలు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రాత్రంతా స్పృహ తప్పి పడిపోయిన ఆ చీమ మరుసటి రోజు ఉదయాన్నే లేచి బియ్యపు గింజను చూస్తుంది. అప్పుడు అది ఆ బియ్యపు గింజని పైకి ఎత్తడానికి కూడా బలం లేకుండా ఎంతో నీరసించి ఉంటుంది. 

తన లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా అది బ్రతికుండాలని అనుకుంది. బ్రతకడానికి ముందుగా తన ఆకలి తీర్చుకోవాలి. కాబట్టి బియ్యపు గింజని తన ఆకిలి తీరేదాక తిని మళ్ళీ తన ప్రయత్నాలని ప్రారంభించింది. ఆరోజు కూడా యథావిధిగా రోజంతా ప్రయత్నించి విఫలం అవుతూనే ఉంది. 

రెండు రోజులు గడిచింది. మూడో రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా తను బ్రతకడానికి కొంత ఆహారాన్ని బియ్యపు గింజ నుండి తినడం ప్రారంభించింది. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని ప్రాణం పోయినా ఈ బియ్యపు గింజను వదిలే ప్రశక్తి లేదు అని అనుకుంది. అలుపెరుగని ఆత్మ విశ్వాసంతో మళ్ళీ ప్రయత్నాలను ప్రారంభించింది. 

గత రెండు రోజుల కంటే ఆ చీమ సామర్ధ్యం ప్రస్తుతం బాగా సన్నగిల్లింది. ఒళ్ళంతా ఒకటే నొప్పి. కానీ బియ్యపు గింజని అలవోకగా గట్టు దాటించింది. ఎంతో సంతోషంతో దానిని తన సమూహం వద్దకి తీసుకెళ్ళింది.

మూడు రోజులుగా కనిపించకుండా పోయిన చీమ రాకతో దాని సమూహం ఎంతో సంతోషపడుతుంది. తన ఆప్త మిత్రుడైన ఒక చీమతో అది మూడు రోజులుగా జరిగిన విషయాలన్నీ చెబుతుంది. అంత బలంగా ఉన్నప్పుడు చేయలేని పని బలహీనంగా ఉన్నప్పుడు ఎలా చేయగలిగావు అని మిత్ర చీమ దానిని ప్రశ్నిస్తుంది. సమాధానం తన దగ్గర కూడా లేదు అని సమాధానం కోసం తన గుంపు నాయకుడి వద్దకు ఆ రెండు చీమలు వెళ్తాయి. 

మిత్ర చీమ వారి నాయకుడికి నమస్కరించి జరిగిన విషయాన్ని వివరంగా చెబుతుంది. మొదటి రోజు బలంగా ఉన్నప్పుడు చేయలేని పనిని తన స్నేహితుడు సామర్ధ్యం క్షీణించి, నిలబడటానికి కూడా బలం లేని సమయంలో ఎట్లా చేయగలిగాడు అని తమ నాయకుడిని ప్రశ్నిస్తుంది. 

ఎంతో అనుభవం, ఓర్పు కలిగిన వారి నాయకుడు ఇలా సమాధానం చెప్తాడు. 

“మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు, దానిని సాధించడానికి ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురౌతాయి. మీరు పట్టు వదలకుండా ఆ లక్ష్యం మీద మాత్రమే దృష్టి ఉంచినప్పుడు మీ సామర్ధ్యం క్షీణించినప్పటికీ మీకు ఎదురైన సమస్యలకు మీ లక్ష్యమే మీకు తోడుగా ఒక భుజాన్ని కాస్తుంది”

నీ మిత్రుడు ఎలాగైనా అతని లక్ష్యాన్ని సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నాడు. అతని సామర్ధ్యానికి మించి ఉన్న అతని లక్ష్యంలో కాసింత బరువు, దానిని సాధించడానికి కావాల్సిన శక్తిని ఇచ్చే అతని ఆకలిని తీర్చడం ద్వారా తగ్గించబడింది. అతని లక్ష్యమే అతని భారాన్ని తగ్గించే దారి చూపింది. తర్వాత అతని స్వీయ సమర్ధతతో తన లక్ష్యాన్ని సులభంగా చేధించగలిగాడు అని నాయకుడు సమాధానం చెప్పాడు. 

ఫణిదర్ కి చీమతో అతని ప్రయత్నాలని పోల్చి చూసుకున్నాడు. చీమ కేవలం మూడు రోజులు ప్రయత్నించి కావాల్సిన ఫలితాన్ని పొందగలిగింది. కానీ నేను మూడేళ్ళు కష్టించినా కనీసం సంతృప్తిని ఇచ్చే చిన్న విజయం కూడా సాధించలేకపోయాను. కాబట్టి తెలుగు మాస్టారు చెప్పిన చీమ కథ కుడా నన్ను తప్పు త్రోవ పట్టించింది. ఈ విషయాన్ని ఉదయాన్నే తెలుగు మాస్టారు వద్దకు వెళ్లి అతడిని నిలదీయాలని నిర్ణయించుకున్నాడు.

ఫణిదర్ ఉదయాన్నే ఆఘమేఘాల మీద నేరుగా అతని తెలుగు మాస్టారు వద్దకు బయల్దేరాడు. తన పూర్వ విద్యార్ధిని చూడగానే తెలుగు మాస్టారు ఎంతో సంతోషించాడు. అతని బాగోగులను అడుగుతూ తమ విద్యార్ధులు అభివృద్దిలోకి వస్తే అంతకంటే చదువు చెప్పిన గురువుకి సంతోషం మరొకటి ఉండదు అని గర్వంగా అతడి భుజం మీద చేయివేసి నిమిరాడు. 

ఫణిదర్ మాట్లాడుతూ నిజంగా మీరు మా అభివృద్దిని కోరుకునే వారు అయితే ఇలా మమ్మల్ని తప్పు త్రోవ పట్టించే కథలను, నీతులను చెప్పేవారే కాదు అని విస్తుపోతూ అన్నాడు. తెలుగు మాస్టారికి అతడి మాటలు ఏమీ అర్ధం కాలేదు. ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ప్రేమగా అతడిని అడిగాడు.

ఫనిధర్ మొదటిగా తెలుగు మాస్టారు చెప్పిన భట్టీ విక్రమార్కుని బేతాళ కథను గురించి గుర్తు చేసాడు. తర్వాత ఫణిదర్ చిన్న తనంలో మాస్టారు చెప్పిన చీమ కథని కూడా గుర్తు చేసాడు. మీరు చెప్పినట్టు అంతకు మించిన ప్రయత్నమే నేను చేసాను. కానీ మాటలు ఏవీ చేతల్లో పనిచేయవు అని నాకు మూడేళ్ళ కాలం వృధా అయితే గానీ తెలిసి రాలేదు అన్నాడు. 

Success Stories in Telugu 2021

తెలుగు మాస్టారు తన కళ్ళ జోడుని సరిచేసుకుంటూ అతని ప్రియమైన విద్యార్ధి ఫణిదర్ పడిన కష్టాలకి బాధపడ్డాడు. తర్వాత ప్రేమగా అతని భుజం మీద చేయి వేసి “సరే, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతావా?” అన్నాడు. అడగండి చెబుతాను అని ఫణిదర్ నిరాశక్తతతో అన్నాడు. 

తెలుగు మాస్టారు మాట్లాడుతూ భట్టి విక్రమార్కుడు తన మౌనాన్ని వీడి విఫలమైన తర్వాత ప్రతీసారి ఏమి చేసేవాడు అని ఫణిదర్ ను ప్రశ్నించాడు. ఫణిదర్ ఆలోచించకుండా ఏముంటుంది మళ్ళీ వెళ్లి బేతాళుడుని భుజం మీద వేసుకుని ముందుకు సాగేవాడు అని టక్కున సమాధానం చెప్పాడు. సరే, మరి నేను చెప్పిన చీమ కథలో చీమ గట్టు ఎక్కడానికి విఫలమైన ప్రతీసారి ఏమి చేసింది అని అడిగాడు. 

ఫణిదర్ మళ్ళీ ఆలోచించకుండా “ఏముంటుంది మళ్ళీ బియ్యపు గింజ తీసుకుని గట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. నేను కూడా అదే చేశాను. కానీ ఆ కథలో చీమ మూడు రోజుల్లోనే సఫలమైంది, నేను మాత్రం మూడేళ్ళుగా విఫలం అవుతూనే ఉన్నాను అదే దానికీ నాకూ మధ్య తేడా” అన్నాడు. 

తెలుగు మాస్టారు చిన్నగా నవ్వి, సరే ఆ చీమ విఫలమైన ప్రతీసారి అదే బియ్యపు గింజని నోట కరుచుకుని గట్టు ఎక్కడం ప్రారంభించింది. నీ లక్ష్యం కూడా ఒకే బియ్యపు గింజ మీద ఉందా, లేదంటే ఓడిన ప్రతీసారి మరో కొత్త గింజను లక్ష్యంగా మార్చుకున్నావా? అని అడిగాడు. తెలుగు మాస్టారు రేకెత్తించిన సందిగ్దతకు ఫణిదర్ ఆలోచనలో పడ్డాడు. అవును అన్నట్టు మొహమాట పడుతూ తలను ఊపాడు.

Success Stories in Telugu 2021

తెలుగు మాస్టారు మాట్లాడుతూ “నువ్వు విజయం సాధించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నావు. కానీ ఎక్కడ విజయం సాధించాలో నీకు స్పష్టత లేదు. పడవ పందెంలో విజయం కోసం రోడ్డు మీద పరిగెడితే ప్రయోజనం ఎలాగైతే ఉండదో విజయం సాధించడానికి కూడా స్పష్టమైన వాహకం ఉండి తీరాలి. అది నీ సామర్ధ్యానికి మించి ఉన్నా ఫర్వాలేదు” అన్నాడు.

ఫణిదర్ కు అతని చేసిన పొరపాటు అర్ధం అయింది. తన మేలుకోరుకునే తెలుగు మాస్టారితో దురుసుగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. మాస్టారు అతడి భుజం పట్టుకుని పైకి లేపాడు. మనకి ఎన్ని నైపుణ్యాలు ఉన్నప్పటికీ మనం తీసుకునే సరైన నిర్ణయాలు మాత్రమే మన నైపుణ్యాలని ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయిస్తాయని, ఇకపై నీ నిర్ణయాలు నిన్ను విజయపథం వైపు నడిపిస్తాయని తెలుగు మాస్టారు గర్వంగా అతన్ని ఉత్తేజ పరిచాడు. అతనిలో వచ్చిన మార్పుకి ఎంతో సంతోషించి ఆశీర్వదించి పంపించాడు. 

  • చివరి బోనస్‍గా క్రింది అద్భుతమైన కొటేషన్స్ చదవండి.
  • 50+ best quotes on life in telugu

తర్వాత ఫణిదర్ ఏడాది కాలం ప్రయత్నించి వదిలేసిన తన మొదటి లక్ష్యాన్ని మళ్ళీ స్వీకరించాడు. రెండు నెలలు అందులోనే బాగా శ్రమించాడు. చిన్న చిన్న పరాభవాలు ఎదురైనప్పటికీ అతడు పట్టించుకోలేదు. తన లక్ష్యమే తన సామర్ధ్యానికి సహాయంగా ఒక భుజాన్ని కాస్తుందన్న చీమ కథని గుర్తు చేసుకుని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

అక్కడికి రెండు, మూడు నెలల్లోనే ఫణిదర్ అనుకున్న లక్షాన్ని చేరుకున్నాడు. సంవత్సర కాలం ప్రయత్నించిన అతను మరో రెండు నెలలు ఏకదాటిగా ప్రయత్నించి ఉంటే ఈ విజయం ఎప్పుడో వచ్చి ఉండేది అని తన గత ప్రవర్తన గుర్తుచేసుకుని నవ్వుకున్నాడు. ఏది ఏమైనా తనకు సరైన మార్గాన్ని సూచించి విజయపథంలో నడిపించిన తెలుగు మాస్టారు యొక్క స్థానం అతని హృదయంలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. 

fitfiu 1500w Mysteries 4 iu hgh get my abs in 1 month to work

9 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!