ఇది విధి కాదు

Telugu Moral Stories New Concept

ఒక ఊళ్ళో సుకుమార్ అనే ఒక అపారమైన అదృష్టవంతుడు ఉండేవాడు. అతడు పుట్టుకతోనే ఒక మహర్జాతకుడు అని ఆ ప్రాంతంలోనే గొప్ప జ్యోతిష్కుడు చెప్పాడు. అతడి పద్దెనిమిదవ ఏట ఒకసారి అలాగే ఇరవై రెండవ ఏట ఒకసారి మరియు ముప్ఫైవ ఏట ఒకసారి ఇలా మూడు సార్లు అతని జీవితంలో అదృష్టం తలుపు తడుతుందని చెప్పాడు. 

telugu moral stories 2021
Telugu moral stories 2021

సుకుమార్ తల్లిదండ్రులు తమ అదృష్టవంతుడైన గారాల బిడ్డ రాకతో వారింట సంబరాలు జరిపించారు. వాళ్ళంతా రాబోయే అదృష్టాన్ని తలచుకుంటూ ఉండగా పద్దెనిమిది ఏళ్ళు క్షణాల్లో గడిచిపోయింది. 

మరో కొన్ని రోజుల్లో కలిసి వచ్చే అదృష్టం కోసం తల్లిదండ్రులతో పాటు సుకుమార్ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో అంతా మంచి జరగాలన్న కాంక్షతో కుటుంబంతో పాటు సుకుమార్ దగ్గరలోని పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకున్నాడు. 

సుకుమార్ యొక్క ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు ఆరోజుతో ముగిసాయి. ఉత్తమ ఫలితాలను ప్రసాదించేలా దేవుడ్ని వేడుకోవాలని సుకుమార్‌కు అతని తల్లిదండ్రులు సూచించారు. అందువలన తల్లిదండ్రులతో పాటు సుకుమార్ ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు బయల్దేరాడు.

పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఒకానొక శక్తివంతమైన ఆలయానికి వారు చేరుకున్నారు. అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు కోర్కెలు తీరాలి అని ముడుపులు కడుతున్నారు. అలాగే మరో వైపు కొన్ని లక్షల మంది ప్రజలు వారి కోర్కెలు తీరినందుకు ముడుపులు చెల్లిస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారం వచ్చినందుకు, ప్రతిపక్ష నాయకులు అధికారం పొందాలని హడావిడిగా ప్రత్యేక దర్శనాలు చేస్తున్నారు. 

ఒకవైపు సినీ తారలు, మరోవైపు వ్యాపారవేత్తలతో ఆలయం కిక్కిరిసిపోతోంది. వందల కోట్ల రూపాయల ఆదాయం లెక్క పెట్టలేక ఉద్యోగులు సైతం అలసిపోతున్నారు. ఆ అద్భుతాన్ని మొదటిసారి వీక్షించిన సుకుమార్ నిర్ఘాంతపోయాడు.

తన కొడుకు పరీక్ష ఫలితాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలని, అలా జరిగితే అందుకు సరిపడా ముడుపులు చెల్లిస్తామని సుకుమార్ తల్లిదండ్రులు వేడుకున్నారు. అలాగే సుకుమార్ కూడా ప్రత్యేకంగా కొన్ని ముడుపులు చెల్లిస్తానని వాగ్దానం చేసాడు. తర్వాత అన్ని క్షేత్రాలను దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు.

పరీక్ష ఫలితాలు సరిగ్గా అతడి పద్దెనిమిదవ ఏట అదే రోజున వచ్చాయి. సుకుమార్ ఉదయాన్నే ఆలయానికి వెళ్లి భక్తితో పూజలన్నీ ముగించుకుని, మరోమారు తన మొక్కుబడి కోసం దేవుడికి గుర్తు చేసాడు.

telugu moral stories 2021
Telugu moral stories 2021

కొన్ని గంటల సమయంలో ఫలితాలు వెలువడ్డాయి. సుకుమార్ ఎగిరి గంతులు వేసాడు. అతడు మంచి మార్కులతో ఎంట్రన్స్ పరీక్షకు ఉత్తీర్ణుడు అయ్యాడు. సుకుమార్ తల్లిదండ్రులు దేవుడ్ని తలచుకుని త్వరలోనే మొక్కుబడి తీర్చుకునేందుకు దర్శనానికి వస్తామని అనుకున్నారు. 

సుకుమార్ దేవుడికి ఇస్తాననుకున్న కానుకలన్నీ సమర్పించుకున్నాడు. తర్వాత ఒక మంచి కాలేజీలో సీటు వచ్చింది. నాలుగేళ్ళ ఇంజినీరింగ్ విద్య సజావుగా సాగిపోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న సుకుమార్ ఒక మంచి ఉద్యోగం కోసం దేవుడ్ని అడగాలని అనుకున్నాడు. 

కుటుంబ సమేతంగా సుకుమార్ తిరిగి పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తూ అదే ఆలయానికి చేరుకున్నాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన వాళ్ళకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి సెలక్ట్ అయితే మొక్కుబడులు చెల్లిస్తామని దేవుడ్ని కుటుంబ సమేతంగా సుకుమార్ వేడుకున్నాడు. 

కొన్ని రోజుల్లో సరిగ్గా తన ఇరవై రెండవ ఏట సుకుమార్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్టు అయినట్టు కాల్ లెటర్ వచ్చింది. అతడి కుటుంబం యొక్క ఆనందానికి అవధులు లేవు. 

ఆరేళ్ళ కాలం పాటు మంచి ఉద్యోగం, సరిపడా జీతంతో ఏ సమస్యలు లేకుండా వారి జీవితం సజావుగా సాగిపోయింది. వయసు పైబడుతూ ఉండటంతో సుకుమార్‌కు పెళ్ళి చేయాలని అతడి తల్లిదండ్రులు నిర్ణయించారు.

ఒక పేరొందిన మ్యాట్రిమోని సంస్థ ద్వారా దగ్గరలోని ఒక వధువుని చూసేందుకు కుటుంబంతో పాటు సుకుమార్ ఉత్సాహంగా బయల్దేరాడు. మొదటి చూపులోనే అతడు ఆమెను ఇష్టపడ్డాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ వధువు కుటుంబానికి ఈ సంబంధం ఎందుకో నచ్చలేదు. అందువల్ల మాకు కాస్త ఆలోచించుకోవడానికి సమయం కావాలని సున్నితంగా చెప్పి పంపించేసారు. 

సుకుమార్ బాగా ఆలోచించాడు. వధువు కుటుంబాన్ని ఎదో ఒకలా ఒప్పించి ఆమెను పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించాడు. కాని అతడికి ఏ దారీ కనిపించలేదు. చివరికి తన కోర్కెలు తీర్చే ఆ భగవంతుడి సన్నిదానంకి వెళ్ళడం ఒక్కటే మార్గం అనుకున్నాడు. 

ఆమెతో అతడి వివాహం జరిగితే రెట్టింపు ముడుపులు చెల్లిస్తానని భగవంతునితో మొరపెట్టుకున్నాడు. ఈ ఒక్క కోరిక తీరితే జీవితంలో నిన్ను మరేదీ అడగను అని తనకు తాను నిర్భంధాలు కూడా పెట్టాడు. 

సరిగ్గా అతడి ముప్ఫైవ ఏట అదే రోజున వధువు తరపున ఒక వ్యక్తి వచ్చి ఈ వివాహం మాకు సమ్మతం అని, త్వరలో ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. 

ప్రపంచాన్నే జయించిన ఆనందంతో సుకుమార్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కొద్దిరోజుల్లోనే వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా పూర్తయింది. తర్వాత సుకుమార్ కుటుంబంతో పాటు ఆలయానికి వెళ్ళి తన మొక్కుబడులు యథావిధిగా నెరవేర్చాడు.

telugu moral stories 2021
Telugu moral stories 2021

పెళ్ళైన రెండు నెలల్లోనే సుకుమార్‌కు తన భాగస్వామితో మనస్పర్ధలు మొదలయ్యాయి. ప్రతీ రోజు దిన దిన గండంగా అతనికి గడవసాగింది. పూర్తిగా మానసిక శాంతిని కోల్పోయిన సుకుమార్ తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసాడు. జీవితం మీద విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి సన్యాసంలో కలిసిపోయాడు. సుకుమార్ ఆ విధంగా సాధారణ జీవితం నుండి సంచార జీవితానికి తన ప్రస్థానాన్ని మార్చుకున్నాడు. 

ఒకరోజు సుకుమార్ దేశ సంచారం చేస్తూ ఒక పెద్ద జ్యోతిష్కుడైన మహాణుభావుడి గురించి తెలుసుకుని అతడి వద్దకు వెళ్ళాడు. అతడు తన శిష్యపరివారంతో సంభాషిస్తున్న సందర్భంలో సుకుమార్ జ్యోతిష్యం అంతా బూటకం అంటూ అతడితో వాగ్వివాదానికి దిగాడు. 

అంతట ఆ జ్యోతిష్కుడు సుకుమార్ ఆవేశాన్ని గమనించి అతడిని శాంతింపజేస్తూ జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించకపోవడానికి కారణాన్ని అడిగాడు. 

సుకుమార్ తనకు గతంలో జ్యోతిష్కుడు చెప్పిన విషయాలను అలాగే తనకి నిజ జీవితంలో జరిగిన సంఘటనల గురించి వివరంగా తెలియజేసాడు. ముప్ఫైవ ఏట రాజయోగం పడుతుందని గతంలో అతడు చెప్పాడని కాని సన్యాస యోగం పట్టిందని సుకుమార్ వాపోయాడు.

Telugu Moral Stories New Concept

జ్యోతిష్కుడు సుకుమార్ జాతకాన్ని ఒకసారి పరిశీలించి చూసాడు. తర్వాత సుకుమార్ వైపు చూసి “అవును, ఆ జ్యోతిష్కుడు చెప్పింది అంతా సరిగ్గానే ఉంది” అన్నాడు. సుకుమార్‌కు పట్టరాని కోపం వచ్చింది. అందుకే, ఇకపై మీ జ్యోతిష్కులను నమ్మేదే లేదు అన్నాడు. 

జ్యోతిష్కుడు సుకుమార్ అజ్ఞానానికి చిన్నగా నవ్వి, సరే ఇకపై ఎప్పుడూ నమ్మొద్దు. కానీ నీ పద్దెనిమిదవ ఏట నీవు రాసిన ఒక పరీక్షలో విఫలం చెందాల్సి ఉంది అది జరిగిందా అని అడిగాడు. 

సుకుమార్‌కు మళ్ళీ కోపం వచ్చింది. “ఏంటి, విఫలం కావడం అదృష్టమా, అలాంటప్పుడు మీరు నా పద్దెనిమిదవ ఏట దురదృష్టం వరిస్తుంది అని చెప్పాలి అని అన్నాడు. 

జ్యోతిష్కుడు మళ్ళీ నవ్వి “అది సరే, నీ ఇరవై నాలుగవ ఏట నీవు ప్రయత్నించిన ఉద్యోగం నీకు రాదు అని నీ జాతకం స్పష్టంగా చెబుతోంది. అలా జరిగిందా? అని అడిగాడు. 

సుకుమార్‌కు నరాలు ఉబ్భుతూ ఉన్నాయి. ఆవేశంతో నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. మీరు మాట్లాడేది మీకు ఏమైనా అర్ధం అవుతోందా? కోరుకున్న ఉద్యోగం లభించకపోవడం అదృష్టమా? అసలు మిమ్మల్ని ఈ జనం ఎలా నమ్ముతున్నారయ్యా అని చీదరించుకుంటూ బయటకు వెళ్ళబోయాడు. 

జ్యోతిష్కుడు కలగజేసుకుని “ఆగు నాయనా, నీ ముప్ఫైవ ఏట నువ్వు కోరుకున్న యువతితో పెళ్లి జరగదు అని నీ జాతకం నొక్కివక్కాణించి చెబుతోంది, కనీసం అదన్నా జరిగిందా అని ఆవేశంతో ఉగిపోతున్న సుకమార్ భుజాన్ని తడుతూ ఆశ్చర్యంగా అడిగాడు జ్యోతిష్కుడు. 

సుకుమార్ ఒక్క క్షణం Testosterone Cypionate for sale in USA – sportlifepower.biz స్తంభించిపోయాడు. ఎందుకంటే కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకోలేకపోవడం అదృష్టం ఎలా అవుతుంది అని అనడానికి అతడి మనసు సహకరించలేదు. వెంటనే ఆ జ్యోతిష్కుడి మొహంలోకి దీనంగా చూస్తూ సుకుమార్ మోకాలిపై అతని ముందు కూర్చున్నాడు. 

“లేదు స్వామీ, ఆ వివాహం జరిగింది అని దిగులుగా సమాధానం చెప్పాడు సుకుమార్. అసలు అలా జరిగేందుకు ఆస్కారమే లేదు కదా, కానీ బహుశా నీవు ఏరికోరి నీ అదృష్టాన్ని మార్చుకున్నావు కదూ? అని అడిగాడు జ్యోతిష్కుడు. 

అవును స్వామి, నా పద్దెనిమిదవ ఏట నేను ఫెయిల్ అయితే అదృష్టం కలిసివస్తుంది అనేది విధి. కానీ ఆ విషయం తెలియక నేను భగవంతుడికి ఏరికోరి మొరపెట్టుకుని దానిని మార్చాను. నా ఇరవై నాల్గవ ఏట ఉద్యోగం రాకపోతే అదృష్టం వరిస్తుందన్నది విధి. దానిని కూడా దేవుడికి ముడుపులు చెల్లించి మరీ మార్చాలని చూసాను. ఇక నా ముప్ఫైవ ఏట ఆమెతో నా వివాహం జరగకూడదు అని విధి. దానిని కుడా మార్చినందుకు ఫలితమే ఈ కాషాయం అన్నాడు. 

జ్యోతిష్కుడు సుకుమార్ యొక్క పరిశీలనా శక్తిని మెచ్చుకుంటూ, చూడు నాయనా, భగవంతుడికి నీకు ఏది ఇవ్వాలో తెలుసు, ఏది ఇవ్వకూడదో తెలుసు. నీ జన్మ నీవు పుట్టకముందే ఈ ప్రపంచంలో నిర్ణయించబడుతుంది. భగవంతుడిని ఆ ప్రయాణాన్ని సుగమనం చేసేలా ప్రార్ధించడం ఒక్కటే సరైన మార్గం. నీవు ఏది చేయాలో, నీకు ఏమి కావాలో నీవే నిర్ణయించుకుంటే భవిష్యత్తు మీద ఎరుక లేని కారణంగా ఫలితాలు ప్రతికూలంగానే ఉంటాయి. అంతేకాకుండా భగవంతుడి శక్తిని పరిమితం చేసే విధంగా కోర్కెలను కోరుకుని మనకు నచ్చినట్టు విధిని మార్చాలని చూస్తే అప్పుడే జీవితంలో అసలైన సమస్యలు ప్రారంభమవుతాయి అన్నాడు.

జరిగినది అంతా అర్ధం చేసుకున్న సుకుమార్ దీనంగా జ్యోతిష్కుని వైపు చూసి “స్వామీ, ఇక నాకు సెలవు ఇప్పించండి” అని చెప్పి అక్కడి నుండి బయల్దేరాడు. 

Telugu Moral Stories Conclusion

గతంలో మూడు సార్లు దర్శించుకున్న ఆ వైభోగవంతమైన ఆలయాన్ని సుకుమార్ మళ్ళీ దర్శించుకున్నాడు. కళ్ళు మూసుకుని “స్వామీ, నీ వద్దకు గతంలో ఎన్నో కోరికలతో వచ్చాను. ప్రస్తుతం నా వద్ద కోర్కెల భండాగారం ఖాళీగా ఉన్నది. నా జీవితం ఇకపై నీ పాద పద్మముల వద్ద ఉంచుతున్నాను. నాకు ఏది మంచిదో, ఏది మంచిది కాదో నాకు అవగాహన లేదు. ఇకపై ఎలా నడిపిస్తావో నీ ఇష్టం” అని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. 

అతడు కోల్పోయిన అదృష్టానికి మించిన ఆనందం అతనికి ఆ క్షణం సాక్షాత్కరించింది. జ్యోతిష్కుడు చెప్పిన రాజయోగం బహుశా అదేనేమో. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!